Mulugu:తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క సొంత నియోజకవర్గమైన ములుగు నియోజకవర్గంలోని ఓ గ్రామంలో గురువారం విషాదం నెలకొన్నది. ఓ రైతు తనకు జరిగిన అన్యాయంపై ఏకంగా గ్రామసభలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం ఆ రైతు పరిస్థితి విషమంగా ఉన్నది.
Mulugu:ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం బుట్టాయిగూడెంలో గురువారం గ్రామ సభ జరిగింది. ప్రజాపాలనలో ప్రభుత్వ పథకాలకు పెట్టి అర్జీలలో దేనికీ అర్హుడు కాడని అధికారులు తేల్చడంతో మనస్తాపానికి గురైన రైతు కుమ్మరి నాగేశ్వరావు అధికారుల ఎదుటే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
Mulugu:వెంటనే రైతును చికిత్స నిమిత్తం ఏటూరునాగారం సామాజికాసుపత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి ములుగు ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఒకవైపు రాష్ట్రవ్యాప్తంగా అత్యధిక గ్రామ సభల్లో ప్రజల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అధికారులతో వాగ్వాదాలు చోటుచేసుకుంటున్నాయి. తమకు పథకాలు ఎందుకు రావంటూ ఎక్కడికక్కడే ప్రజలు నిలదీస్తున్నారు.