Re-Release Darling: ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ క్రేజ్ గురించి చెప్పనవసరం లేదు. తన సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చినా ఫస్ట్ డే రికార్డ్స్ పెట్టడంలో ఆయనని మించినవారు ఎవరూ లేరు. కానీ ఈసారి స్ట్రెయిట్ సినిమాతోనే కాదు రీ-రిలీజ్ తో కూడా తన సత్తాని చాటాడు అనొచ్చు. ఏప్రిల్ 23, 2026 నాటికి ‘డార్లింగ్’ రిలీజ్ అయి 16 ఏళ్లు అవడంతో సినిమాని రీ-రిలీజ్ చేశారు.
ప్రభాస్ ని మళ్ళీ ఇంకోసారి లవర్ బాయ్ లుక్ లో చూడడానికి ఫ్యాన్స్ థియేటర్లకు ఎగబడ్డారు. దీంతో ఫస్ట్ డే 7.59 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్ట్ చేసి రీ-రిలీజ్ లో కూడా రికార్డు సృష్టించింది. ఈ సినిమాని చూడడానికి జెన్ జీ (Gen Z) కూడా థియేటర్స్ కి రావడం ఇంకో విశేషం.
డార్లింగ్ సినిమాలో ప్రభాస్ చేసిన వింటేజ్ కామెడీ, ఆయన డాన్సులు, సాంగ్స్ కి థియేటర్ లో ఫ్యాన్స్ ఫుల్ ఎంజాయ్ చేశారనొచ్చు.
2010 లో రిలీజ్ అయిన ఈ సినిమాకి ఏ. కరుణాకరన్ దర్శకత్వం వహించారు. బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ శ్రీ వెంకటేశ్వరా సినీ చిత్ర బ్యానర్ పైన ఈ సినిమాని ప్రొడ్యూస్ చేశారు. ప్రభాస్ కి జోడిగా కాజల్ అగర్వాల్ నటించారు.
