Indiramma Indlu: ఇందిరమ్మ ఇండ్ల పథకం కింత తమకు ఇండ్లు మంజూరు కాలేదని ఊరూరా అర్హులైన ప్రజల నిరసనలు ఊపందుకున్నాయి. గుడిసెల్లో నివాసం ఉంటున్నా తమకు ప్రాధాన్యం ఇవ్వలేదని ఆందోళనకు దిగుతున్నారు. కాంగ్రెస్ కార్యకర్తల కుటుంబాలకే కేటాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. పంచాయతీ కార్యదర్శులు అక్రమంగా డబ్బులు తీసుకొని వారికే ఇళ్లు కేటాయిస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు.
Indiramma Indlu: మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం చీకటాయపాలెం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో అవకతవకలు జరిగాయని గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట మంగళవారం (జూన్ 10) గ్రామస్థులు నిరసనకు దిగారు. పంచాయతీ కార్యదర్శి ఇంటికి లక్ష రూపాయలు అక్రమంగా వసూలు చేసి అర్హులమైన తమకు ఇళ్లు మంజూరు చేయలేదని ఆరోపించారు.
Indiramma Indlu: ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో అక్రమాలకు పాల్పడిన పంచాయతీ కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేశారు. కార్యదర్శిని సస్పెండ్ చేయాలంటూ నినాదాలు చేశారు. కొందరి వద్ద డబ్బులు తీసుకొని వారికే ఇండ్లు కేటాయించారని ఆరోపించారు. ఇండ్ల కేటాయింపుపై సమగ్ర విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు.
Indiramma Indlu: ఇది ఒక్క చీకటాయపాలెం గ్రామంలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా పలు గ్రామాల్లో నిరసనలు పెల్లుబుకుతున్నాయి. పూరి గుడిసె వాసులకూ ఇండ్లు కేటాయించలేదని ఆరోపణలు వచ్చాయి. వారంతా ఎక్కడికక్కడ నిరసనలకు దిగుతున్నారు. అధికార పార్టీ నాయకులకే ఇండ్లు కేటాయించారని పలు చోట్ల పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి.