Indian Railways: రైళ్లలో దూరప్రాంతాలకు ప్రయాణించే వారిలో చాలా మంది పైబెర్తులున్న టికెట్లు దొరికితే అవస్థలు పడాల్సి వస్తుంది. ముఖ్యంగా వృద్ధులు, మహిళల అవస్థలు వర్ణనాతీతం. ఇలాంటి వారికోసమే కేంద్ర ప్రభుత్వం సువర్ణావకాశం కల్పించింది. వారు ఇక నుంచి అవస్థలు పడకుండా ఉండేందుకు సరైన నిర్ణయం తీసుకున్నది. దీంతో ఆ వర్గాలు వారు హర్షం వ్యక్తంచేస్తున్నారు.
Indian Railways: రైళ్లలో వృద్ధులు, 45 ఏళ్లు పైబడిన మహిళలకు లోయర్ బెర్తులు కేటాయిస్తామని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా ఆయన రాజ్యసభలో ప్రసంగిస్తూ ఈ విషయాన్ని ప్రకటించారు. టికెట్ బుకింగ్ సమయంలో వారు ఎంచుకోకున్నా, సాంకేతిక అంశాల ఆధారంగా ఆటోమేటిక్ గా వారికి కింది బెర్తులే వస్తాయని తెలిపారు.
Indian Railways: స్లీపర్, 3ఏసీ బోగీల్లో కొన్ని బెర్తులను పెద్దలు, 45 ఏళ్లు పైబడిన మహిళలకు కేటాయించినట్టు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ రాజ్యసభలో వెల్లడించారు. రైళ్లలో దివ్యాంగులు, వారి సహాయకులకు ఇలానే కొన్ని సీట్లను రిజర్వ్ చేసినట్టు కూడా ఆయన తెలిపారు. దీంతో రైళ్లలో ప్రయాణించే సమయాల్లో అసహాయుల అవస్థలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం సరైన చర్య తీసుకున్నదని మానవతావాదులు కొనియాడుతున్నారు.
