Prabhas: యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అని చెప్పొచ్చు. బాహుబలి: ది ఎపిక్ స్క్రీనింగ్ తర్వాత ఎక్కడా కనిపించని ప్రభాస్, ఆఖరికి ‘స్పిరిట్’ పూజా సెరిమొనీలో కూడా తన చేతులతోనే పోస్ట్ వేశారు వంగా. జపాన్‌లో ‘బాహుబలి: ది ఎపిక్ షో’ వేయడంతో అక్కడికి నిర్మాత శోభుతో కలిసి ప్రభాస్ వెళ్లారు. ఇప్పుడు తన ఫొటోలు, వీడియో క్లిప్స్, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
జపాన్‌లో ఉన్న ప్రభాస్‌ని కలవడానికి భారీగా అభిమానులు వచ్చారు. ఫ్యాన్స్ మీట్‌లో అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. మధ్య మధ్యలో ఫ్యాన్స్‌కు హాయ్‌లు, చేతులతో లవ్ సింబల్ చూపించడం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇందులో ఓ ఫ్యాన్, బాహుబలి తర్వాత మీ లైఫ్‌లో జరిగిన మార్పుల గురించి చెప్పమని అడగగా, దానికి ప్రభాస్, బాహుబలి సినిమాకి ముందు తాను ఇండియాలో ఉన్న ఒక చిన్న రాష్ట్రం జనాలకు మాత్రమే తెలుసునని, ఎప్పుడైతే బాహుబలి సినిమా రిలీజ్ అయ్యి భారీ విజయం సాధించిందో, తన ముఖం ఇండియాతో పాటు హాలీవుడ్‌లో కూడా ప్రాచుర్యం పొందింది అని చెప్పారు. కానీ స్టార్ స్టేటస్ పెరిగింది, రెమ్యూనరేషన్ పెరిగింది. కానీ తన లైఫ్‌లో మాత్రం ఎలాంటి మార్పులూ లేవు అని తెలిపారు. ఇంతకు ముందు ఉన్న స్కూల్ ఫ్రెండ్స్ మాత్రమే ఉన్నారు, పెద్ద మార్పులు లేవు అంటూ చెప్పుకొచ్చారు.
Define Prabhas in 30 secs.
Answer:🥹❤️ (I’m not crying)
pic.twitter.com/RwAhhYIqyZ— Legend Prabhas 🇮🇳 (@CanadaPrabhasFN) December 5, 2025
జపాన్‌లో ‘స్పిరిట్’ లుక్
ప్రభాస్, సందీప్ రెడ్డి వంగాతో ‘స్పిరిట్’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం రాత్రి పగలు తేడా లేకుండా షూట్ చేస్తున్నారు. ఫస్ట్ షెడ్యూల్ అయిపోతున్నా సినిమా నుండి ఒక్క ఫోటో కూడా లీక్ కాకుండా మూవీ టీం జాగ్రత్తలు తీసుకున్నారు. ఇందులో భాగంగానే, సినిమా పూజా కార్యక్రమంలో కూడా చిరంజీవితో ప్రభాస్ షేక్ హ్యాండ్ ఇస్తున్న ఫోటో మాత్రమే రిలీజ్ చేశారు. ప్రస్తుతం ‘స్పిరిట్’ సినిమానే చేస్తుండడంతో, ఇదే ‘స్పిరిట్’ లుక్ అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
PRABHAS = KING 👑
“#SSRajamouli wanted to make a FILM ON THE KING and he thought I was THE BEST.
He PREPARED 5 STORIES and in every story the KING was COMMON.”
– #Prabhas pic.twitter.com/Ez2p8TrHSN
— Movies4u Official (@Movies4u_Officl) December 5, 2025
ఇది కూడా చదవండి: DK Shivakumar: నేషనల్ హెరాల్డ్ కేసులో బిగ్ ట్విస్ట్.. డీకే శివకుమార్‌కు నోటీసులు
లీన్ లుక్‌లో ఉన్న ప్రభాస్ చాలా రోజుల తర్వాత పైన క్లాత్ (షర్ట్/కోట్) లేకుండా కనిపించడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఫ్యాన్స్ మీట్ ఈవెంట్‌కే ఇలా స్టైలిష్ లుక్‌లో ఉంటే, ఇక సందీప్ రెడ్డి వంగా మూవీలో ఇంకెంత స్టైలిష్‌గా చూపిస్తారో అంటూ ఫ్యాన్స్ అంటున్నారు. అర్జున్ రెడ్డి, యానిమల్, కబీర్ సింగ్ వంటి యాక్టర్స్‌కి కెరీర్ బెస్ట్ లుక్స్ ఇచ్చారు, ఒక్కటి అని చెప్పలేం. డ్రెస్సింగ్ నుండి కాలుకి వేసుకునే చెప్పుల వరకు ప్రతిదానికి ఒక స్టైలిష్ లుక్ ఉంటుంది. ఇక ప్రభాస్ చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఒక సినిమా షూటింగ్ అయిపోవడమే ఆలస్యం, వెంటనే ఇంకో సినిమాకి సైన్ చేస్తున్నారు.
