Crime News: అమెరికాలోని మసాచుసెట్స్ (Massachusetts) రాష్ట్రంలో ఒక అత్యంత దిగ్భ్రాంతికరమైన, ఘోరమైన ఘటన వెలుగుచూసింది. సొంత కన్నతల్లిని, తమ్ముడిని ఓ 17 ఏళ్ల భారత సంతతి కుర్రాడు అతి దారుణంగా హత్య చేశాడు. ఆక్టన్ (Acton) నగరంలో జరిగిన ఈ నినుగుటక మింగలేని దారుణం స్థానిక ప్రజలను, ఎన్ఆర్ఐ (NRI) వర్గాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
పోలీసులు జరిపిన రాత్రిపూట గాలింపు చర్యల అనంతరం బుధవారం ఉదయం నిందితుడు అర్జున్ అరవింద్ (Arjun Aravind – 17) ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఘోరకలి ఎలా వెలుగులోకి వచ్చిందంటే?
ఆక్టన్-బాక్స్‌బరో రీజనల్ హైస్కూల్‌లో చదువుతున్న అర్జున్ అరవింద్, మంగళవారం రోజున తన ఇంట్లోనే తల్లి సుధా వెంకటేశన్ (45), తమ్ముడు సిద్ధార్థ్ అరవింద్ (14) లపై దాడి చేసి ప్రాణాలు తీశాడు. అనంతరం తల్లికి చెందిన హోండా అకార్డ్ కార్లో అక్కడి నుంచి పరారయ్యాడు.
-
ట్యూటర్ రాకతో వెలుగులోకి: మంగళవారం సాయంత్రం 6:30 గంటల సమయంలో ట్యూషన్ చెప్పే ఉపాధ్యాయురాలు వారింటికి రాగా, ఎంత పిలిచినా తలుపులు తీయకపోవడంతో ఆమె అర్జున్ తండ్రికి ఫోన్ చేసింది.
-
పోలీసుల ఎంట్రీ: భార్య, చిన్న కుమారుడికి తండ్రి ఎన్నిసార్లు ఫోన్ చేసినా కలవకపోవడంతో ఆయన వెంటనే ఆక్టన్ పోలీసులను ఆశ్రయించి ఇంటిని పరిశీలించాలని కోరారు.
-
పోలీసులకు కనిపించిన దృశ్యం: పోలీసులు ఇంట్లోకి వెళ్లగా.. ఇల్లు రక్తాసిక్తమై ఉంది. తల్లి సుధ మృతదేహం బేస్‌మెంట్‌లో, చిన్న కొడుకు సిద్ధార్థ్ మృతదేహం మొదటి అంతస్తులో కనిపించాయి. ఇద్దరి శరీరాలపై తీవ్రమైన గాయాలు (Obvious Trauma) ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
చాట్‌జీపీటీ (ChatGPT) లో కుటుంబ సభ్యుల హత్యపై పరిశోధన!
ఈ దర్యాప్తులో మిడిల్‌సెక్స్ కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ ఆఫీస్ అధికారులు సంచలనాత్మక విషయాలను వెల్లడించారు..
“అర్జున్ ఇటీవల తీవ్రమైన మానసిక వైపరీత్యాలతో, వింత ప్రవర్తనతో బాధపడుతున్నట్లు తెలిసింది. తన సొంత కుటుంబాన్ని ఎలా అంతమొందించాలనే ఆలోచనలు, ఫాంటసీల కోసం ఆయన ఇంటర్నెట్‌తో పాటు చాట్‌జీపీటీ (ChatGPT) ని వాడుకుని సెర్చ్ చేశాడని దర్యాప్తులో బయటపడింది.”— మిడిల్‌సెక్స్ జిల్లా అటార్నీ కార్యాలయం
గోథిక్ నవలల స్టైల్‌లో (Gothic novel-kind of stories) పాత్రలను క్రియేట్ చేస్తూ, వింత ప్రశ్నలు అడుగుతూ చాట్‌జీపీటీని కథల తయారీ పేరిట హత్యల ఆలోచనల కోసం వాడినట్లు పోలీసులు గుర్తించారు.
ఎలా దొరికాడంటే?
హత్యలు చేసిన అనంతరం తల్లి కార్ తీసుకుని పారిపోయిన అర్జున్ కోసం పోలీసులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. బుధవారం వేకువజామున వేలాండ్ (Wayland) నగరంలోని ఒక పార్కింగ్ లాట్‌లో కారు నిలిపి ఉండటాన్ని గమనించిన పోలీసులు.. కారులో ఉన్న అర్జున్‌ను ఎటువంటి ప్రతిఘటన లేకుండా అదుపులోకి తీసుకున్నారు.
అర్జున్‌పై రెండు హత్య కేసులు (Two counts of murder) సహా గృహ హింస, వాహనం దొంగతనం వంటి పలు తీవ్రమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. హత్యకు ఉపయోగించిన ఆయుధం ఏంటనేది ఇంకా విచారణలో ఉందనీ, పోస్టుమార్టం నివేదిక వచ్చాక మరిన్ని వివరాలు వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.
