PBKS vs MI: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025లో అత్యంత ఉత్కంఠభరితమైన మ్యాచ్ అహ్మదాబాద్ వేదికగా ఈ రోజు జరుగుతోంది. క్వాలిఫయర్ 2 మ్యాచ్ నేడు జరుగుతుంది. గెలిచిన జట్టు నేరుగా ఫైనల్స్‌కు చేరుకుంటుంది. అయితే, ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగిస్తే ఏమి జరుగుతుందో అని అందరూ ఆసక్తిగా ఉన్నారు. అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే క్వాలిఫయర్ 2 మ్యాచ్‌కు ‘రిజర్వ్ డే’ లేదు. అంటే ఈరోజు, ఆదివారం వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అయితే, సోమవారం మ్యాచ్ నిర్వహించలేరు.
వర్షం కారణంగా క్వాలిఫయర్ 2 మ్యాచ్ పూర్తిగా రద్దైతే, లీగ్ దశ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన జట్టు ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. దీని అర్థం పంజాబ్ కింగ్స్ ఫైనల్‌లోకి ప్రవేశిస్తుంది! ఎందుకంటే లీగ్ దశలో పంజాబ్ ముంబై కంటే మెరుగైన స్థానంలో ఉంది. ఇది ముంబై అభిమానులకు కాస్త ఆందోళన కలిగించే విషయమే.
ఇది కూడా చదవండి: IPL 2025 Qualifier 2: క్వాలిఫయర్-2 కోసం ముంబై-పంజాబ్ తరపున ఆడే 11 మంది వీళ్లే..
ప్రస్తుతానికి వర్షం పడే ప్రమాదం లేదు! అయితే, శుభవార్త ఏమిటంటే ప్రస్తుత వాతావరణ నివేదిక ప్రకారం, నేటి మ్యాచ్‌కు వర్షం పడే అవకాశం పెద్దగా లేదు. పూర్తి స్థాయి ఆటను ఆశించవచ్చని అహ్మదాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. దీంతో క్రికెట్ ప్రేమికులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) క్వాలిఫయర్ 1 మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌ను ఓడించి నేరుగా ఫైనల్స్‌కు చేరుకుంది.
ఈరోజు జరిగే క్వాలిఫయర్ 2 మ్యాచ్‌లోకి ముంబై ఇండియన్స్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతుంది. వారి ప్రస్తుత ఫామ్ చూస్తుంటే, ముంబై జట్టు పంజాబ్ కింగ్స్ కంటే బలంగా కనిపిస్తోంది. ముంబై బ్యాటింగ్ , బౌలింగ్ రెండింటిలోనూ సమతుల్య జట్టుగా ఉంది. పంజాబ్ కూడా బలంగా ఉన్నప్పటికీ, ముంబై లాంటి జట్టును ఎదుర్కోవడం వారికి సవాలుగా ఉంటుంది. మరి ఫైనల్ టికెట్ ఎవరికి దక్కుతుందో వేచి చూడాలి. వర్షం వచ్చి పంజాబ్ సద్వినియోగం చేసుకుంటుందా లేదా ముంబై తన ఆధిపత్యాన్ని నిరూపించుకుని ఫైనల్‌కు చేరుకుంటుందో లేదో వేచి చూడాలి.