Crime News:సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ పట్టణంలో శనివారం అర్ధరాత్రి దాటాక 2.30 గంటలకు ఎస్‌బీఐ ఏటీఎంలో భారీ చోరీ చోటుచేసుకున్నది. పట్టణంలోని లింగగిరి రోడ్డులో ఉన్న ఏటీఎంలో దుండగులు డబ్బుతో సహా నగదు బాక్సులను కూడా అపహరించుకుపోయారు. చోరీ అనంతరం ఏటీఎం మిషన్‌ను దుండగులు పూర్తిగా దహనం చేశారు. ఫార్చూనర్ కారులో వచ్చిన దొంగలు ఈ చోరీకి పాల్పడినట్టుగా పోలీసులు గుర్తించారు. చోరీ చేసిన నగదు సుమారు రూ.20 లక్షల వరకు ఉండవచ్చని భావిస్తున్నారు.
