టాలీవుడ్ యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరీ వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని వాడుకుంటోంది. ఈ నేపథ్యంలోనే త్వరలోనే విడుదల కానున్న మట్కా, లక్కీ భాస్కర్ లాంటి సినిమాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది. గుంటూరు కారంలో మహేశ్ బాబుకు జంటగా నటించినా ఎక్కువసేపు తెరపై కనిపించలేదు. ఇక ఈ అమ్మడు తాజా తమిళ్ లో శింబుతో జోడీ కట్టేందుకు రెడీ అయింది. ఇదంతా బాగానే ఉన్నా.. మీనాక్షి చౌదరీకి చెందిన ఓ న్యూస్ తెగ వైరలవుతోంది. దీనిపై చివరికి ఈ అమ్మడు క్లారీటీ ఇచ్చుకోవల్సి వచ్చింది.
తాజాగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ‘లక్కీ భాస్కర్’ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించిన విషయం తెల్సిందే. ఆ సినిమా విడుదల నేపథ్యంలో మీడియా ముందుకు వచ్చిన మీనాక్షి చౌదరి తన గురించి మీడియాలో వస్తున్న పుకార్లపై స్పందించింది.
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర మూవీలో మీనాక్షి చౌదరీ ఓ కీలక రోల్ చేస్తోందని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఈ వార్తలను మీనాక్షి చౌదరి స్పందించింది. విశ్వంభరలో తాను నటిస్తున్నట్టుగా వార్తలు ఎందుకు వస్తున్నాయో అర్థం కావడం లేదు. ఏదైనా సినిమా ఒప్పుకుంటే నేనే స్వయంగా ప్రకటిస్తానని చెప్పేసింది. దీంతో ఈ పుకార్లకు ఫుల్ స్టాప్ పడింది. సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న విశ్వంభర సినిమాను 2025 సమ్మర్ లో విడుదల చేయబోతున్నారు. ఈసారి విడుదల తేదీ విషయంలో మార్పు ఉండదని సమ్మర్‌కి కచ్చితంగా విడుదల చేసి తీరుతామంటూ నిర్మాతలు ప్రకటించారు.