Hyderabad News: గడిచిన ఏడాదికి వీడ్కోలు పలుకుతూ.. నూతన సంవత్సరారంభానికి స్వాగతం పలుకుతూ హైదరాబాద్ మహానగరం తాగి ఉగిందనడానికి ఈ చిత్రాలే నిదర్శనం. డిసెంబర్ 31 రాత్రి నుంచి అర్ధరాత్రి దాటేంత వరకూ అన్ని ప్రాంతాల్లో ప్రజలు సందడి చేశారు. ఇండ్లల్లో కొందరు న్యూ ఇయర్ వేడుకలు చేసుకోగా, హోటళ్లు, లాడ్జీ గదులు, పబ్‌లు, బార్లలో మరికొందరు చేసుకోగా, సమూహాలుగా ఫంక్షన్‌హాళ్లలో ఇంకొందరు చేసుకున్నారు. మరికొన్ని సమూహాలు ఏకంగా స్టేడియాల్లోనే భారీ ఎత్తున పండుగ చేసుకున్నారు.
Hyderabad News: నూతన సంవత్సర వేడుకలు చేసుకునేందుకు హైదరాబాద్ నగరంలోని ఉప్పల్ మున్సిపల్ స్టేడియాన్ని సంబంధిత అధికారులు రాత్రి అనుమతి ఇచ్చారు. న్యూ ఇయర్ పార్టీ నిర్వాహకులు స్టేడియంలో తాగి ఊగారు. బాటిళ్లకు బాటిళ్లు లాగించేశారు. ఇష్టారీతిన తినేశారు. సరే అందరూ పండుగ చేసుకున్నారు. వీరూ చేసుకున్నారు. కానీ ఇది పబ్లిక్ పార్కు అన్నమాట. కానీ పరిశుభ్రం చేయించాల్సి ఉండే కానీ అలా చేయకుండా వెళ్లిపోయారన్నమాట.
Hyderabad News: ఉదయం, సాయంత్రం వేళల్లో ఇక్కడ స్థానికులు ఎందరో వాకింగ్ చేస్తుంటారు. జనవరి 1న యథావిధిగా వాకింగ్ కోసం ఎందరో స్థానికులు రాగా ఆ స్టేడియం అంతా చిందరవందరగా పడి ఉన్న మద్యం బాటిళ్లు దర్శనమిచ్చాయి. తినుబండారాల చెత్త వారి కంట పడి దుర్వాసన రాసాగింది. ఈ సీన్లను కళ్లారా చూసిన కాలనీవాసులు షాక్ అయ్యారు. ఈ చిత్రాలు పలు సోషల్ మీడియా వేదికల్లో వైరల్‌గా మారాయి.