Hyderabad: హైదరాబాద్ నగరంలో వైద్య రంగంలో మరో అరుదైన ఘటన చోటుచేసుకున్నది. హైదరాబాద్ మెట్రో రైలుకు గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేసి సకాలంలో గుండెను తరలించి మరో రోగికి అమర్చి ప్రాణాన్ని కాపాడారు. దీనిపై నగరంలో పెరిగిన వైద్య అవసరాలకు ఇదో అరుదైన అవకాశంగా పలువురు కొనియాడుతున్నారు.
Hyderabad: హైదరాబాద్ నగరంలోని ఎల్బీ నగర్ పరిధిలోని కామినేని ఆసుపత్రి నుంచి లక్డీకాపూల్ పరిధిలో ఉన్న గ్లోబల్ ఆసుపత్రికి మెట్రో రైలులో వైద్యులు గుండెను తరలించారు. దీనికోసం మెట్రో అధికారులు గ్రీన్ కారిడార్‌ను ఏర్పాటు చేయడం విశేషం. ఈ రెండు ఆసుపత్రుల మధ్య ఉన్న 13 కిలోమీటర్ల దూరాన్ని 13 నిమిషాల్లోనే చేరుకొని రోగికి వైద్యులు గుండెను అమర్చారు.