Anupama Parameswaran: మలయాళీ ముద్దుగుమ్మ అనుపమా పరమేశ్వర్ ఇప్పుడు పూర్తి హై లో ఉంది. ఆమె కెరీర్ లో బహుశా ఇన్ని భాషల్లో ఇన్ని సినిమాలు ఎప్పుడూ చేసిన దాఖలాలు లేవు. ‘టిల్లు స్క్వేర్’ మూవీతో గ్లామర్ గేట్లు ఎత్తేసిన అనుపమాకు ఆఫర్స్ క్యూ కట్టాయి. దాంతో ‘టిల్లు స్క్వేర్’కు ముందు అనుపమా… ఆ తర్వాత అనుపమా అంటూ సినీ జనం మాట్లాడుకుంటున్నారు. లిప్ లాక్స్ విషయంలో అస్సలు రాజీనే పడని అనుపమను చూసి… ఆమెతో సినిమాలు తీస్తున్నవారు యూత్ ను టార్గెట్ చేస్తూ కొన్ని ప్రత్యేకమైన సన్నివేశాలను క్రియేట్ చేస్తున్నారట. ఆ రకంగా అనుపమా చేతిలో ఇప్పుడే ఏకంగా రెండు మలయాళ చిత్రాలతో పాటు మూడు తమిళ చిత్రాలు, రెండు తెలుగు సినిమాలు ఉన్నాయి. తెలుగులో ‘పరదా, మరీచిక’ సినిమాల్లో అనుపమా నటిస్తోంది. అలానే ధ్రువ్ విక్రమ్ తో ‘బిసోన్’, ప్రదీప్ రంగనాథ్ తో ‘ఎంటర్ ది డ్రాగన్’ మూవీస్ చేస్తోంది. ఏదేమైనా ఈ యేడాది మరోసారి అనుపమా తన సత్తాను చాటబోతోంది.