Hyderabad: హైదరాబాద్ శివారులో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. అబ్దుల్లాపూర్ మెట్టు సమీపంలో జరిగిన ఈ ఘటనలో తూఫ్రాన్ పేట్‌కు చెందిన దంపతులు ప్రాణాలు కోల్పోయారు.
వివరాల్లోకి వెళితే… అబ్దుల్లాపూర్ మెట్టు వద్ద రోడ్డు దాటుతుండగా లారీ వేగంగా వచ్చి దంపతులను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. మృతులును తూఫ్రాన్‌పేట్‌కు చెందిన వెంకటేష్, లక్ష్మీగా గుర్తించారు.
ఈ దుర్ఘటన స్థానికులను తీవ్రంగా కలిచివేసింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
వెంత వేగంగా వచ్చిన లారీ అదుపుతప్పి వీరిని ఢీకొట్టినట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటన మరోసారి రోడ్డు భద్రత ప్రాధాన్యతను గుర్తుచేసింది.