Horoscope: మేషం
ఆరోగ్యం విషయంలో మిక్కిలి శ్రద్ధ అవసరం. శారీరక శ్రమతోపాటు మానసిక ఆందోళన తప్పదు. చిన్న విషయాలకోసం ఎక్కువ శ్రమిస్తారు.బంధు, మిత్రులతో మనస్పర్థలు రాకుండా జాగ్రత్త వహించడం మంచిది. అనుకోకుండా డబ్బు చేజారే అవకాశాలు ఉన్నాయి.
వృషభం
వ్యవహారంలో ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది. చేసే పనులలో కొన్ని ఇబ్బందులు వస్తాయి.రుణప్రయత్నాలు సులభంగా ఫలిస్తాయి. కుటుంబంలో అనారోగ్య బాధలు ఉంటాయి. బంధు, మిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త పడటం మంచిది.
మిథునం
కోరుకునేది ఒకటైతే జరిగేది మరొకటవుతుంది. అనారోగ్య బాధలు స్వల్పంగా ఉన్నాయి. వేళ ప్రకారం భుజించడానికి ప్రాధాన్యమిస్తారు. చంచలం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. మనోనిగ్రహానికి ప్రయత్నించాలి. పిల్లలపట్ల ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు.
కర్కాటకం
స్త్రీల మూలకంగా లాభాలు ఉంటాయి. ప్రయత్నకార్యాలన్నింటిలో విజయం పొందుతారు. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబం అంతా సౌఖ్యంగా ఉంటారు. అత్యంత సన్నిహితులను కలుస్తారు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు.
సింహం
ఆకస్మిక ధనలాభం ఉంది. క్రీడాకారులు, రాజకీయరంగాల్లోని వారికి అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి. అన్నింటా విజయాన్నే సాధిస్తారు. బంధు, మిత్రులు కలుస్తారు. శుభవార్తలు వింటారు. వృత్తి, ఉద్యోగరంగాల్లోవారికి అభివృద్ధి ఉంటుంది.
కన్య
మనోధైర్యాన్ని కోల్పోకుండా జాగ్రత్త వహించడం అవసరం. నూతన కార్యాలకు ఆటంకాలేర్పడతాయి. కోపాన్ని తగ్గించుకుంటే మంచిది. కఠిన సంభాషణవల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇతరులకు హానితలపెట్టే కార్యాలకు దూరంగా ఉంటారు.
తుల
ఆరోగ్యం గురించి జాగ్రత్తపడటం మంచిది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విదేశయాన ప్రయత్నాలకు మార్గం సుగమమవుతుంది. కుటుంబ కలహాలకు దూరంగా ఉంటే మేలు. సహనం అన్నివిధాలా శ్రేయస్కరం. డబ్బును పొదుపుగా వాడుతారు.
వృశ్చికం
నూతన వస్తు, వస్త్ర, ఆభరణాలు పొందుతారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. విద్యార్థుల ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. వినోదాల్లో పాల్గొంటారు. చర్చలు, సదస్సులు మిమ్మల్ని ఆకర్షిస్తాయి. మనోధైర్యాన్ని కలిగి ఉంటారు. శుభవార్తలు వింటారు.
ధనుస్సు
పిల్లలవల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. అధికారులతో గౌరవింపబడుతారు. పట్టుదలతో కొన్ని కార్యాలు పూర్తిచేసుకుంటారు. అనారోగ్య బాధలు తొలగిపోతాయి. ప్రయాణాలు జాగ్రత్తగా చేయడం మంచిది. నూతన వ్యక్తులు పరిచయమవుతారు.
మకరం
అనుకోకుండా కుటుంబంలో కలహాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అశుభవార్తలు వినాల్సి వస్తుంది. ఆకస్మిక ధననష్టం జరుగకుండా జాగ్రత్త పడటం మంచిది. మనస్తాపానికి గురవుతారు. ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం. నూతన కార్యాలు వాయిదా వేసుకోక తప్పదు.
కుంభం
బంధు, మిత్ర విరోధం ఏర్పడకుండా జాగ్రత్త పడటం మంచిది. మానసిక ఆందోళన అధికమవుతుంది. అనారోగ్య బాధలను అధిగమిస్తారు. అనవసర నిందలతో అపకీర్తి వస్తుంది. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. నూతన కార్యాలకు ప్రణాళికలు వేస్తారు.
మీనం
ఆత్మీయుల సహకారం ఆలస్యంగా లభిస్తుంది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. ప్రయాణాలు జాగ్రత్తగా చేయడం మంచిది. అజీర్ణ బాధలు అధికమవుతాయి. కీళ్లనొప్పుల బాధ నుంచి రక్షించుకోవడం అవసరం. మనోవిచారాన్ని కలిగి ఉంటారు.