Home Minister Anitha: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి వనితా అనిత తాజాగా విశాఖపట్నంలో “అస్త్రం” అనే ట్రాఫిక్ యాప్‌ను ప్రారంభించారు. ఈ యాప్‌ను ప్రజలకు మిత్రంగా (పబ్లిక్ ఫ్రెండ్లీ) రూపొందించినట్లు మంత్రి వెల్లడించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, “నానేను విశాఖ వాసిని. ఇక్కడి ట్రాఫిక్ సమస్యలను దగ్గర నుంచి చూసాను. ఆ అనుభవంతోనే ట్రాఫిక్‌పై సమగ్ర సమాచారం అందించేలా ఈ యాప్‌ను తీసుకొచ్చాం” అని తెలిపారు.
అస్త్రం యాప్ ద్వారా ట్రాఫిక్ జామ్‌లు, డైవర్షన్లు, రోడ్డు మూతలు, ప్రత్యామ్నాయ మార్గాలు వంటి అన్ని వివరాలు సమయానుసారం అందుబాటులో ఉంటాయని మంత్రి పేర్కొన్నారు. ఈ యాప్‌ను టెలిగ్రామ్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని, వచ్చే మూడునెలల్లో పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుందని తెలియజేశారు.
ప్రజల భద్రత, సౌకర్యం దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఈ యాప్ వాహనదారులకు మేలు చేస్తుందన్న నమ్మకం వ్యక్తం చేశారు.