KL Rahul: భారత్ – ఇంగ్లాండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఈ నెలాఖరులో ప్రారంభం కానుంది. దీని కోసం భారత జట్టును బీసీసీఐ ఇప్పటికే ప్రకటించింది. ఈ సిరీస్ ప్రారంభానికి ముందు, ఇండియా A, ఇంగ్లాండ్ లయన్స్ మధ్య అనధికారిక టెస్ట్ సిరీస్ జరుగుతోంది. రెండు జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్‌లో భారత్ అద్భుతమైన ప్రదర్శన ఇచ్చినప్పటికీ..గెలుపును అందుకోలేకపోయారు. ప్రస్తుతం రెండో టెస్టు జరుగుతోంది. మొదటి ఇన్నింగ్స్ లో కేఎల్ రాహుల్ అద్భుతమైన సెంచరీతో మెరిశాడు.
నార్తాంప్టన్‌లోని కౌంటీ గ్రౌండ్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో కెఎల్ రాహుల్ 13 ఫోర్లు, ఒక సిక్సర్‌తో తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్ తర్వాత ఇంగ్లాండ్ వెళ్లిన రాహుల్ కు ఈ సెంచరీ చాలా స్పెషల్. 151 బంతుల్లో సెంచరీ చేసిన రాహుల్ కు ఇది ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో 19వ సెంచరీ.
ఇది కూడా చదవండి: Bengaluru Stampede: బెంగళూరు తొక్కిసలాట.. కీలక సంస్కరణలకు సిద్ధమైన బీసీసీఐ!
మొదట బ్యాటింగ్ చేసిన భారత్ కు ఆదిలోనే షాక్ తగిలింది. యశస్వి జైస్వాల్ కేవలం 17 పరుగులకే ఔటవ్వగా, అభిమన్యు ఈశ్వరన్ కేవలం 11 పరుగులకే ఔటయ్యాడు. కేఎల్ కరుణ్ నాయర్‌తో కలిసి జట్టు స్కోరును 126 పరుగులకు తీసుకెళ్లాడు. 40 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కరుణ్ నాయర్ వికెట్ కోల్పోయాడు. ఆ తర్వాత ధ్రువ్ జురెల్‌తో కలిసి అద్భుతమైన సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి ఇంగ్లాండ్ లయన్స్‌ను క్లిష్ట పరిస్థితుల్లోకి నెట్టాడు. రాహుల్ సెంచరీతో మెరవగా.. జురెల్ అర్ధ సెంచరీ చేశాడు.
కేఎల్ రాహుల్ పై ఆశలు
కెఎల్ రాహుల్ చేసిన ఈ సెంచరీ అనధికారిక టెస్ట్‌లో జరిగినప్పటికీ.. ఇంగ్లాండ్ పర్యటనను పరిగణనలోకి తీసుకుంటే ఈ ఇన్నింగ్స్ చాలా ముఖ్యమైనది. విరాట్, రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ కావడంతో, రాహుల్ ఫామ్ జట్టుకు చాలా అవసరం. ప్రస్తుతం టీమిండియాలో అంతా యంగ్ ప్లేయర్స్ ఉన్నారు. ఇటువంటి పరిస్థితిలో, కెఎల్ రాహుల్ ఫామ్ జట్టుకు ఉత్సాహాన్నిచ్చింది.