Hyderabad: ఈసెట్, లాసెట్, ఐసెట్ తేదీలు ఖరారు

Hyderabad: తెలంగాణ ఉన్నత విద్యామండలి 2025-26 విద్యాసంవత్సరానికి సంబంధించిన ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసింది. బీఈ, బీటెక్, బీ ఫార్మసీ, ఫార్మ్ డీ వంటి కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీ ఎంసెట్ పరీక్షలను ఏప్రిల్, మే నెలల్లో నిర్వహించనున్నట్లు ప్రకటించింది.

టీజీ ఎంసెట్:

అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సులు: ఏప్రిల్ 29, 30 (కంప్యూటర్ ఆధారిత విధానం)

ఇంజినీరింగ్ కోర్సులు: మే 2 నుండి 5 వరకు (కంప్యూటర్ ఆధారిత విధానం)

ఇతర ప్రవేశ పరీక్షలు:

టీజీ ఈసెట్: మే 12

టీజీ ఎడ్‌సెట్: జూన్ 1

టీజీ లాసెట్, ఎల్‌ఎల్‌ఎం: జూన్ 6

టీజీ ఐసెట్: జూన్ 8, 9

టీజీ పీజీఈసెట్: జూన్ 16 నుంచి 19 వరకు

టీజీ పీఈసెట్: జూన్ 11 నుంచి 14 వరకు

తెలంగాణ ఉన్నత విద్యామండలి ఈ తేదీలను ఖరారు చేయడం ద్వారా విద్యార్థులు తమ ప్రణాళికలను ముందుగానే సక్రమంగా చేసుకునే అవకాశం కల్పించింది.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Hyderabad: గుడ్ న్యూస్.. రైతు భరోసాకు లైన్ క్లియర్..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *