Hyderabad: హైదరాబాదులో ఉద్రిక్తత నెలకొంది. ప్రియాంక గాంధీపై ఢిల్లీ బీజేపీ నేత రమేశ్ బిధూరి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా, ఇవాళ యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు హైదరాబాద్ లోని బీజేపీ ఆఫీస్‌ను ముట్టడించడానికి ప్రయత్నించారు. ఈ ప్రయత్నంలో బీజేపీ నేతలు యూత్ కాంగ్రెస్ నాయకులను అడ్డుకోవడంతో తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది.
ఈ ఘర్షణ సమయంలో, కాంగ్రెస్ నాయకులు బీజేపీ ఆఫీస్‌పై రాళ్లతో దాడి చేశారు. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తమవ్వడంతో, పరస్పరం కర్రలతో దాడి చేసుకునే స్థాయికి వెళ్లింది. ఈ ఘటనలో బీజేపీ నేతలకు గాయాలయ్యాయి.పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.