Weather: బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. ఏపీలో భారీ వర్షాలు

Weather: ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారింది. ఇది ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలతో పాటు అండమాన్, నికోబార్ దీవులు, పుదుచ్చేరిలలో కూడా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని వాతావరణ శాఖ వర్గాలు వెల్లడించాయి. బలపడిన వాయుగుండం తమిళనాడు మీదుగా శ్రీలంక వైపు కదులుతున్నది.

ప్రస్తుతం ఇది ట్రింకో మాల్ కు 380 కిలో మీటర్లు, నాగపట్నంకు 650 కిలో మీటర్లు, చెన్నైకి 800 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతం అయ్యింది. దీంతో వాతావరణ శాఖ తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్, అండమాన్, నికోబార్ దీవులు, పుదుచ్చేరి ప్రభుత్వాలను అప్రమత్తం చేసింది. దీని ప్రభావంతో రెండు రోజుల్లో నెల్లూరు, తిరుపతి, ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది వాతావరణ శాఖ.

గుంటూరు, కృష్ణ, ఉభయ గోదావరి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని సమాచారం అందించింది. అలాగే దక్షిణ కోస్తా తీర ప్రాంతాల్లో 50 నుండి 70 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్ళొద్దని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. వాయుగుండం ఎఫెక్ట్ తెలంగాణ వైపు కూడా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుఫాను నేడు తమిళనాడు తీరాన్ని తాకవచ్చు. వీటిలో చెన్నై, చెంగల్‌పేట, కాంచీపురం, తిరువళ్లూరు, కడలూరు, నాగపట్నం ఉన్నాయి. వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడగా, చెన్నైలో 7 విమానాలు ఆలస్యమయ్యాయి.

తుఫానును ముందే ఊహించి, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి, తిరువారూర్, మైలాడుతురై, నాగపట్నం మరియు కడలూరు జిల్లాల్లో ఎన్‌డిఆర్‌ఎఫ్ మరియు రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళాన్ని మోహరించాలని ఆదేశించారు.

తుఫాను కారణంగా, నైరుతి బంగాళాఖాతం మరియు శ్రీలంక, తమిళనాడు తీరాల దగ్గర నవంబర్ 26 నుండి నవంబర్ 29 వరకు గాలుల వేగం గంటకు 65 కి.మీ.కు చేరుకునే అవకాశం ఉంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Dana Cyclone Updates: తీరం దాటిన దానా తుపాను.. ఒడిశాలో పరిస్థితి అల్లకల్లోలం!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *