Delhi Pollution: ఢిల్లీలో గాలి నాణ్యత గురువారం తీవ్ర స్థాయికి చేరుకుంది. గురువారం ఉదయం 6 గంటలకు, ఢిల్లీలోని 31 ప్రాంతాల్లో కాలుష్యం అత్యంత దారుణంగా ఉంది. జహంగీర్‌పురిలో అత్యధిక ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 567 నమోదైంది. కాగా, పంజాబీ బాగ్‌లో 465 .. ఆనంద్ విహార్‌లో 465 AQI నమోదైంది.
ఫ్లైట్‌ట్రేడర్ 24 వెబ్‌సైట్ ప్రకారం, పొగమంచు కారణంగా ఢిల్లీ విమానాశ్రయంలో 300కు పైగా విమానాలు ఆలస్యమయ్యాయి. గురువారం మధ్యాహ్నం వరకు ఢిల్లీకి 115 విమానాలు రాగా, 226 విమానాలు బయలుదేరాయి. సమాచారం ప్రకారం, విమానం రావడానికి 17 నిమిషాలు .. బయలుదేరడానికి 54 నిమిషాలు ఆలస్యం అయింది. దట్టమైన పొగమంచు కారణంగా ఐజీఐ విమానాశ్రయంలో బుధవారం 10 విమానాలను దారి మళ్లించారు.
ఇది కూడా చదవండి: Manipur AFSPA: మణిపూర్‌లోని ఆ పోలీస్ స్టేషన్స్ లో మళ్ళీ సాయుధ దళాల ప్రత్యేక రక్షణ చట్టం
Delhi Pollution: ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌లో రాసింది- విమానాశ్రయంలో విజిబిలిటీ తక్కువగా ఉంది. విమానాల రాకపోకలు .. నిష్క్రమణలకు సంబంధించి సంబంధిత విమానయాన సంస్థల నుండి అప్‌డేట్‌లను తీసుకోవాలని ఎయిర్ పోర్ట్ అధికారులు ప్రయాణీకులను అభ్యర్ధించారు.
ఇక ఉత్తరాది రాష్ట్రాల్లో చూస్తే కనుక హిమాచల్‌లో నవంబర్ 18 వరకు చాలా దట్టమైన పొగమంచు ఉంటుంది. హర్యానా, పశ్చిమ బెంగాల్, సిక్కిం, బీహార్, జార్ఖండ్‌లలో నవంబర్ 16 వరకు పొగమంచు కురిసే అవకాశం ఉంది. మహారాష్ట్రలోని విదర్భలో బుధవారం అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రత 11.4 డిగ్రీల సెల్సియస్ నమోదైంది.
అలాగే, పొగమంచు కారణంగా హర్యానాలోని రోహ్‌తక్‌లో 9 వాహనాలు ఢీకొని ఒక యువకుడు మరణించాడు . దీంతో పలు రైళ్లు ఆలస్యంగా నడిచాయి. 5 చోట్ల జరిగిన ప్రమాదాల్లో 9 వాహనాలు ధ్వంసమయ్యాయి. పంజాబ్‌కు చెందిన ట్రక్ డ్రైవర్ ధర్మేంద్ర కైతాల్‌లో మృతి చెందాడు.