Baba Siddique Murder Case: ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీపై కాల్పులు జరిపిన వ్యక్తి ఆయన మరణించినట్టు తేలేవరకూ ఆసుపత్రి దగ్గర వేచి ఉన్నాడు. కాల్పులు జరిపిన వెంటనే చొక్కా మార్చుకుని ఆసుపత్రి బయట జనాల మధ్య అరగంట సేపు నిలబడ్డానని షూటర్ పోలీసులకు తెలిపాడు. దాడిలో సిద్ధిఖీ చనిపోయాడా లేక ప్రాణాలతో బయటపడ్డాడా అని ఆరా తీస్తూనే ఉన్నాడు. సిద్దిఖీ పరిస్థితి విషమంగా ఉందని.. మృతి చెందారని తెలియగానే అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
66 ఏళ్ల బాబా సిద్ధిఖీని అక్టోబర్ 12న రాత్రి 9:11 గంటలకు ముంబైలోని బాంద్రాలో కాల్చి చంపారు . అతని కొడుకు కార్యాలయం వెలుపల అతనిపై కాల్పులు జరిపారు. దీంతో ఆయన ఛాతీలోకి రెండు బుల్లెట్లు దూసుకుపోయాయి. ఆయనను వెంటనే లీలావతి ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు.
ఇది కూడా చదవండి: Delhi Pollution: ఢిల్లీలో కాలుష్యం తీవ్రస్థాయికి..
Baba Siddique Murder Case: ప్రధాన నిందితుడు శివ్ కుమార్ గౌతమ్ సిద్ధిఖిని చంపడానికి ఎటువంటి ప్లాన్ వేశారో పోలీసులకు చెప్పాడు. మొదటి ప్లాన్ ఉజ్జయిని రైల్వే స్టేషన్‌లో అతని సహచరులు – ధరమ్‌రాజ్ కశ్యప్ .. గుర్మైల్ సింగ్‌లను కలవడం. బిష్ణోయ్ ముఠా సభ్యుడు అతన్ని వైష్ణో దేవి వద్దకు తీసుకువెళతాడు. అయితే కశ్యప్, సింగ్‌లు పోలీసులకు చిక్కడంతో ప్లాన్ విఫలమైంది.
రెండో ప్లాన్ ప్రకారం ప్రధాన నిందితుడు గౌతమ్ సిద్ధిఖీని కాల్చి చంపాడు. తరువాత పరారయ్యాడు. ఉత్తరప్రదేశ్‌లోని నాన్‌పరా పట్టణానికి 10 కిలోమీటర్ల దూరంలో 10 నుంచి 15 గుడిసెలతో ఉన్న సెటిల్‌మెంట్‌లో గౌతమ్ తలదాచుకున్నాడు. అతని కాల్ రికార్డ్ ఆధారంగా పోలీసులు పట్టుకున్నారు.