Harry Brook

Harry Brook: పొగమంచు వల్లే అవుట్ అయ్యాం…! ఇంగ్లాండ్ యువ బ్యాటర్ హ్యారీ బ్రూక్ సంచలన వ్యాఖ్యలు.

Harry Brook: మొదటి టీ20లో భారత జట్టు చేతిలో ఇంగ్లాండ్ ఘోర పరాభవం పొందిన తర్వాత ఆ జట్టు యువ స్టార్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ మ్యాచ్ లో తమ బ్యాటర్లు విఫలం కావడానికి కొన్ని ఆశ్చర్యకరమైన కారణాలను బ్రూక్ చెప్పడం గమనార్హం. మరి ఈరోజు జరగబోయే రెండవ టి20 ముందు ఈ ఇంగ్లాండ్ బ్యాటర్ చేసిన వ్యాఖ్యలు ఏమిటో ఇపుడు తెలుసుకుందాం. 

భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్ లో మొదటి మ్యాచ్ లో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో సునయాసమైన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇక ఇంగ్లాండ్ జట్టు 20 ఓవర్లలో కేవలం 132 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది. కెప్టెన్ జాస్ బట్లర్ మినహాయించి ఏ ఒక్క ప్లేయర్ కూడా భారత స్పిన్నర్లను సమర్ధవంతంగా ఎదుర్కోలేకపోయారు.

ఇక బ్రూక్ విషయానికి వస్తే 14 బంతుల్లో కేవలం 17 పరుగులు సాధించి అతను చక్రవర్తి బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అయితే తాను అలా అవుట్ అయ్యేందుకు భారత్ లో రాత్రి ఉండే పొగమంచు కారణం అని బ్రూక్ చెప్పడం విశేషం. భారత్ లో ఉండే పొగమంచు వల్ల తాను సరిగ్గా బంతిని చూడలేకపోతున్నానని… అదే తను ఇలా అవుట్ అయ్యేందుకు ఒక కారణమని అతను చెప్పుకొచ్చాడు. తనతో పాటు తన తోటి జట్టు సభ్యులకు కూడా ఈ సమస్య ఉందని చెప్పాడు.

ఇది కూడా చదవండి: Virender Sehwag Divorce: 21 ఏళ్ల తర్వాత… విడాకులు తీసుకోబోతున్న వీరేంద్ర సెహ్వాగ్, ఆర్తి?

Harry Brook: అయితే స్పిన్ ఆడే విధానంలో తన సొంత టెక్నిక్ ను కూడా తప్పుపట్టుకున్న ఈ ఇంగ్లాండు మిడిల్ ఆర్డర్ బ్యాటర్ టి20 మ్యాచ్ లలో స్పిన్ ఆడడం ఒక పెద్ద చాలెంజ్ అని చెప్పుకొచ్చాడు. తను కూడా స్పిన్ ఆడే చాలా మెరుగుపడాలని అభిప్రాయపడ్డాడు. అయినప్పటికీ పొగ మంచుని ఒక కారణంగా చూపించడం మాత్రం నిజంగా ఆశ్చర్యమే. భారత బ్యాటర్లు కూడా అదే పోగమంచులో ఆడారు. మరి వారికి లేని ఇబ్బంది కొత్తగా ఇంగ్లాండ్ బ్యాటర్లకి ఎక్కడ నుండి వచ్చింది అన్నది ప్రశ్న.

ఇకపోతే వరుణ్ చక్రవర్తి విసిరిన గూగ్లీకి అవుట్ అయిన హ్యారీ బ్రూక్… రాబోయే ఐపీఎల్ సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తరఫున ఆడనున్నాడు. ఇక అక్కడ ఉండే వాతావరణ కాలుష్యానికి పొగమంచుకి హ్యారీ బ్రూక్ ఎలా ఆడుతాడు అన్నది పెద్ద ప్రశ్న. ఏదేమైనప్పటికీ వారి టెక్నిక్ లోని లోపాలను ఇలా పొగుమంచి పేరుతో కప్పిపుచ్చుకోవడం ఎంతవరకు సబబు అన్నది ఇక్కడి ప్రశ్న.

ALSO READ  Eggs: గుడ్లను ఫ్రిజ్‌లో ఎన్ని రోజులు ఉంచితే మంచిది?

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *