Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రజా ప్రతినిథిగా కొద్దిగా గ్యాప్ తీసుకుని పెండింగ్ లో ఉన్న సినిమాలపై దృష్టి సారించారు. అందులో భాగంగా విజయవాడలో ప్రత్యేకంగా రూపొందించిన గ్రీన్ మ్యాట్ స్టూడియోలో ‘హరిహర వీరమల్లు’ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ సినిమా తొలి పార్ట్ దాదాపు పూర్తి కావచ్చింది. మార్చి 28 రిలీజ్ అంటూ నిర్మాత ఎ.ఎం. రత్నం డేట్ కూడా ప్రకటించారు. ఇదిలా ఉంటే పవన్ నటిస్తున్న ‘ఓజీ’ సినిమా షూటింగ్ కూడా వైజాగ్ లో జరుగుతోంది. గ్యాంగ్ స్టర్ సినిమా కావటంతో దీనిపై కూడా అంచనాలు బాగానే ఉన్నాయి. దీనిని కూడా వచ్చే ఏడాది ఏప్రిల్, మే నెల్లో రిలీజ్ చేయాలనుకుంటున్నారు నిర్మాత దానయ్య. రిలీజ్ విషయంలో అటు రత్నం కానీ, ఇటు దానయ్య కానీ తగ్గేట్లు కనిపించటం లేదు. అయితే రెండు సినిమాల మధ్య కనీసం నాలుగైదు నెలలైనా గ్యాప్ ఉంటే బాగుంటుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ రెండింటిని పూర్తి చేసి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూటింగ్ మొదలు పెట్టి పూర్తి చేయాలన్నది పవన్ ఆలోచన. ఆయన మనసులో ఏముందే కానీ ప్రస్తుతానికి ఎ.ఎం.రత్నం, దానయ్య ఎవరికి వారు తమ తమ సినిమాలను త్వరతగతిన పూర్తి చేసి రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. మరి వీరిద్దరి చిత్రాలలో ఏది ముందు… ఏది వెనుక రిలీజ్ అవుతుందన్నది పవర్ స్టార్ డిసైడ్ చేస్తే బాగుంటుందంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో!
