Jayashankar Bhupalpally: కొందరు ఈ భూమి మీద ఎందుకు పుడతారా తెలియదు. ఆలా పుట్టే ప్రతి ఒకడు..పనికిమాలిన పనులు చేయడమే..పనిగా పెట్టుకుని…సొసైటీలో తిరుగుతూ ఉంటారు. దేవుడు మనుషులను సృష్టిస్తే …సైతాన్లు రాక్షసులను పుట్టిస్తారు కదా…అలాంటి రాక్షులే ఇప్పుడు మన మధ్య తిరుగుతున్నారు. అందులో కొందరు..నీచ్ కమినే కుక్కలు ఇలా చేస్తున్నాయి .
తెలంగాణలో కొన్నిరోజులుగా హిందు దేవాలయాలలోని విగ్రహాలపై దాడులు ఘటనలు తరచుగా వార్తలలో ఉంటున్నాయి. ఇటీవల సికింద్రాబాద్ లోని ముత్యాలమ్మ ఆలయంలోని అమ్మవారి విగ్రహంను ఒక వర్గానికి చెందిన వ్యక్తి కాలితో తన్నుతూ నీచంగా ప్రవర్తించిన ఘటన వైరల్ గా మారిన విషయం తెలిసిందే.
Jayashankar Bhupalpally: ఆ తర్వాత శంషాబాద్ లోని నవగ్రహాల విగ్రహాలు, మరో గ్రామదేవత ఆలయంలో కూడా ఇటీవల విగ్రహాల ధ్వంసం ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా హిందు సంఘాలు మాత్రం ఈ వరుస ఘటనలో ఫైర్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో మరో షాకింగ్ ఘటన ప్రస్తుతం వెలుగులోకి వచ్చింది. తెలంగాణ ప్రొఫెసర్ జయశంకర్ జిల్లా భూపాల పల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది.
ప్రస్తుతం కార్తీక మాసం నడుస్తొంది. ముఖ్యంగా భక్తులు కార్తీక మాసంను ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈ నెలంతా మద్యం, మాంసాదులకు దూరంగా ఉంటారు. ఈ క్రమంలో ప్రతిరోజు దగ్గరలోని ఆలయంకు తప్పనిసరిగా వెళ్తుంటారు. అయితే.. తాజాగా.. జయశంకర్ జిల్లా భూపాల పల్లి జిల్లా మహాదేవ్ పూర్ మండలంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. అంబటి పల్లిలో జరిగిన ఘటన ప్రస్తుతం పెనుదుమారంగా మారింది. ఇక్కడ స్థానికంగా అమరేశ్వర ఆలయం ఉంది. ఆంజనేయ స్వామి ఈ ఆలయంలో భక్తులతో పూజలు అందుకుంటారు
Jayashankar Bhupalpally: అయితే.. ఏమైందో కానీ.. ఆంజనేయ స్వామి విగ్రం నిప్పులు అంటుకున్నాయి. హనుమయ్య ఆలయం అంతా అగ్నీకీలలు వ్యాపించాయి. చుట్టురా నల్లని పొగ వ్యాపించింది. దీంతో అక్కడికి వచ్చిన భక్తులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. మంటలు ఎగిసి పడుతూ.. చూస్తుండగానే విగ్రహం అంతా కాలిపోయింది. ఈ ఘటనకు మాత్రం కారణాలు తెలియరాలేదు. మరీ కావాలని చేశారా.. లేదా.. ఏదైన ప్రమాదం జరిగిందా..అనేది తెలియాల్సి ఉంది.