Hanuman Ansh: భారతీయ సినీ చరిత్రలో ఎవరూ ఊహించని అద్భుతం బాక్సాఫీస్ వద్ద ఆవిష్కృతమైంది. ఎలాంటి స్టార్ కాస్ట్ లేదు, భారీ ప్రమోషన్లు లేవు.. కేవలం రూ. 2 కోట్ల నామమాత్రపు బడ్జెట్‌తో తెరకెక్కిన ఒక చిన్న ఆధ్యాత్మిక సినిమా ఇప్పుడు ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ప్రఖ్యాత ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలి బాబా జీవిత స్ఫూర్తితో తెరకెక్కిన భక్తి ప్రధాన సినిమా ‘హనుమాన్ అంశ్’ (Hanuman Ansh) ఏకంగా ₹200 కోట్ల గ్రాస్ మైలురాయిని దాటి సరికొత్త రికార్డులను తిరగరాసింది. రూ. 10 లక్షల ఓపెనింగ్‌తో మొదలైన ఈ సినిమా.. పెద్ద పెద్ద స్టార్ హీరోల సినిమాలను సైతం వెనక్కి నెట్టి థియేటర్లలో ప్రభంజనం సృష్టిస్తోంది.
రూ. 10 లక్షల నుంచి ₹200 కోట్ల వరకు – అద్భుత ప్రయాణం..
-
ప్రధాన పాత్రలో నీమ్ కరోలి బాబాగా నటించిన శోభినావ్ సత్య అసలు నటుడే కాదు. ఆయన ఈ సినిమాకి సెకండ్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.
-
అనుకోకుండా అసలు హీరో అనారోగ్యం పాలవడంతో, దర్శకుడు విశాల్ చతుర్వేది దాదాపు 5 గంటల పాటు శోభినావ్ సత్యకు ఆడిషన్ నిర్వహించి ఈ పాత్రకు ఎంపిక చేశారు. తెరపై ఆయన జీవించిన తీరు ప్రేక్షకులను కట్టిపడేసింది.
-
విహాన్ షెడ్గే, చందన్ ఆనంద్, పూర్ణిమ తివారీ, అనిల్ కే రస్తోగి తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు.
మూడు భాగాలుగా రాక – హోంబలే ద్వారా గ్లోబల్ రిలీజ్:
చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తున్న ‘హనుమాన్ అంశ్’.. సరైన కంటెంట్, భక్తి భావన ఉంటే ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారని మరోసారి నిరూపించింది.
