Guvvala Balaraju: అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల విధులకు ఆటంకం కల్పించారనే విషయమై ఎస్ఐ ఫిర్యాదు మేరకు ఈ కేసును నమోదు చేశారు. మాజీ ఎమ్మెల్యేతో పాటు పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలపైనా పోలీసులు కేసులు నమోదు చేశారు. నాగర్‌కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలోని ఓ ఆలయంలో జరిగిన వివాదంపై ఈ కేసు నమోదైంది.
Guvvala Balaraju: అచ్చంపేట పట్ణణంలోని భ్రమరాంబ ఆలయంలో పూజలు చేసేందుకు మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు చేరుకున్నారు. అదే సమయంలో ఆలయంలో ప్రస్తుత ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ పూజలు చేస్తున్నారంటూ పోలీసులు బాలరాజు, ఇతరులను లోనికి అనుమతించలేదు. దీంతో పోలీసులతో బాలరాజు, ఇతర బీఆర్ఎస్ నేతలు వాగ్వాదానికి దిగారు.
Guvvala Balaraju: తమను అనుమతించకపోవడంతో గువ్వల బాలరాజు, బీఆర్ఎస్ కార్యకర్తలు ఆలయం ఎదుటే బైఠాయించి నిరసన తెలిపారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీకృష్ణతో కుమ్మక్కై ఇన్‌స్పెక్టర్ రవీందర్ తనను టార్గెట్ చేసి తనను కావాలనే ఇబ్బందులు పెడుతున్నారని మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఆరోపించారు. న్యాయవ్యవస్థ దీనిని సుమోటోగా స్వీకరించి తనకు న్యాయం చేయాలని కోరారు.