Hyderabad: హైదరాబాదులో డ్రగ్స్ పార్టీ పోలీసులు పంజా విసిరారు. మాదాపూర్ లోని ఓ హోటల్ లో డ్రగ్స్ పార్టీ నిర్వహిస్తున్న రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ డ్రగ్స్ పార్టీలో ప్రముఖ కొరియోగ్రాఫర్ మరియు ప్రముఖ ఆర్కిటెక్ట్ తో సహా నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే ప్రముఖ కొరియోగ్రాఫర్ మహంతి హోటల్ లో నిర్వహించిన డ్రచ్ పార్టీలో రెడ్ హ్యాండెడ్గా పట్టుపడ్డారు. మహంతి తో పాటు ఆర్కిటెక్ట్ ప్రియాంక రెడ్డని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రియాంక రెడ్డి ఇచ్చిన డ్రగ్స్ పార్టీలో కొరియోగ్రాఫర్ మహంతి తో పాటు మరో నలుగురు పాల్గొన్నట్టు పోలీసులు గుర్తించారు.
డ్రగ్స్ బెంగళూరు నుంచి తెప్పించుకున్నట్టు నిర్ధారించారు. ఘటనా స్థలంలో ఎండిఎంఏ తో పాటు మరో రెండు రకాల డ్రగ్స్ ను పోలీసులు సీజ్ చేశారు. డ్రగ్స్ పార్టీలో పాల్గొన్న నలుగురిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తామన్నారు.