Group 1 Exams:

Group 1 Exams: గ్రూప్‌-1 మెయిన్స్ ప‌రీక్ష‌ల షెడ్యూల్ విడుద‌ల‌

Group 1 Exams: గ్రూప్-1 ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌కు సంబంధించిన ఏపీపీఎస్సీ ముఖ్య స‌మాచారం అంద‌జేసింది. మెయిన్స్ ప‌రీక్ష‌ల‌ను ఈ ఏడాది మే 3 నుంచి 9 వ‌ర‌కు నిర్వ‌హించాల‌ని క‌మిష‌న్ నిర్ణ‌యించింది. ఈమేర‌కు అధికారికంగా తేదీల‌ను కూడా విడుద‌ల చేసింది. దీంతో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అభ్య‌ర్థుల ఉత్కంఠ‌కు తెర‌ప‌డింది.

Group 1 Exams: గ్రూప్ 1 మెయిన్స్ ప‌రీక్ష‌ల‌ను డిస్క్రిప్టివ్ టైమ్‌లో నిర్వ‌హిస్తామ‌ని, ప్ర‌శ్న‌ప‌త్రాన్ని ట్యాబుల్లో ఇవ్వాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు ఏపీపీఎస్సీ కార్య‌ద‌ర్శి తెలిపారు. ప్ర‌తిరోజూ ఉద‌యం 10 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం ఒంటిగంట వ‌ర‌కు ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించ‌నున్న‌ట్టు తెలిపారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో మొత్తం 81 గ్రూప్ 1 పోస్టుల భ‌ర్తీకి మొత్తంగా 1,48,881 మంది అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. గ‌తేడాది మార్చి 17న ప్రిలిమిన‌రీ ప‌రీక్ష నిర్వ‌హించారు. వీరిలో 4,496 మంది అభ్య‌ర్థులు మెయిన్స్ ప‌రీక్ష‌ల‌కు అర్హ‌త సాధించినట్టు అధికారులు తెలిపారు.

మెయిన్స్ ప‌రీక్ష‌ల షెడ్యూల్‌
మే 3 – క్వాలిఫైయింగ్ ఎగ్జామ్‌, తెలుగు
మే 4 – క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ (ఇంగ్లిష్‌)
మే 5 – పేప‌ర్ 1 (జ‌న‌ర‌ల్ సైన్స్‌)
మే 6 – పేప‌ర్ 2 (ఇండియా, ఏపీ చ‌రిత్ర‌, సంస్కృతి, భూగోళ‌శాస్త్రం)
మే 7 – పేప‌ర్ 3 (పాలిటీ)
మే 8 – పేప‌ర్ 4 (ఇండియా, ఏపీ ఎకాన‌మీ)
మే 9 – పేప‌ర్ 5 (సైన్స్ అండ్ టెక్నాల‌జీ, ఎన్విరాన్‌మెంట‌ల్ ఇష్యూస్‌)

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Amit Shah: జగన్ పై షా ఆగ్రహం..బాబుకు అండగా కేంద్రం..:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *