Gold Price Today

Gold And Silver Prices Today: అక్కడ అలా.. ఇక్కడ ఇలా.. బంగారం ధరలు ఈరోజు ఎలా ఉన్నాయంటే..

Gold And Silver Prices Today: బంగారం అంటే అందరికీ ఏంటో ఆసక్తి. మహిళలు అనే కాదు పురుషుల్లోనూ బంగారంపై ఎంతో ఇష్టం ఉంటుంది. అందులోనూ మన దేశంలో బంగారం విషయంలో ఉండే ఆకర్షణ వేరే లెవెల్ లో ఉంటుంది. పండుగలు, పెళ్లిళ్లు.. ఏ శుభకార్యానికైనా కొద్దిపాటి బంగారం కొనాలని అందరూ తహతహ లాడతారు. అంతేకాదు బంగారం మంచి పెట్టుబడి సాధనంగా కూడా ఉంటుంది. కాస్త బంగారం కొనిపెట్టుకుంటే అవసరంలో ఆడుకుంటుంది అనే వారి నుంచి బంగారం కొని.. అమ్మడం వంటివి చేస్తూ దాని వ్యాపారంగా చూసేవారి వరకూ బంగారం కొనడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. 

అయితే, బంగారం ధరలు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి. మారిపోయే బంగారం ధరలను చెక్ చేసుకోవడం కూడా మనలో చాలామందికి ఇంట్రెస్టింగ్ విషయం బంగారం ధరలపై చాలా అంశాలు ప్రభావం చూపిస్తాయి. అంతర్జాతీయంగా వచ్చే మార్పుల నుంచి.. స్థానికంగా ఉండే డిమాండ్.. టాక్స్ ల ఆధారంగా బంగారం ధరల్లో మార్పులు ఉంటాయి. అలాగే మన దేశంలో ప్రాంతాలను బట్టి కూడా బంగారం ధరల్లో వ్యత్యాసం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈరోజు బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి పరిశీలిద్దాం.

Gold And Silver Prices Today: అంతర్జాతీయంగా బంగారం ధరల్లో ఈరోజు అంటే 30.12.2024న పెరుగుదల  కనిపిస్తోంది. ఆ ప్రభావం మన దేశంలో కనిపించలేదు. నిన్న కాస్త తగ్గిన బంగారం ధరలు ఈరోజు మార్పులు లేకుండా ఉన్నాయి.  హైదరాబాద్ లో కూడా బంగారం ధరలు స్థిరంగా నిలిచాయి.  ఈరోజు అంటే 30.12.2024న హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధరలు 10 గ్రాముల ధర మార్పులు లేకుండా   71,350రూపాయలుగా ఉంది. అలాగే, 24 క్యారెట్ల బంగారం ధర కూడా పది గ్రాములకు 77,840 రూపాయల వద్ద నిలిచింది. 

ఇది కూడా చదవండి: Today Horoscope: ఈరాశి వారికి తలపెట్టిన పనిలో సక్సెస్ దొరుకుతుంది.. ఈరోజు రాశిఫలాలు..

ఇక హైదరాబాద్ లో వెండి విషయానికి వస్తే వెండి ధరలు కూడా ఎటువంటి మార్పులు లేకుండా కొనసాగుతున్నాయి.  కేజీ వెండి 99,900 రూపాయల వద్ద ఉంది. 

మన తెలుగురాష్ట్రాల్లో ఇతర ప్రాంతాల విషయానికి వస్తే, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, వరంగల్, కరీంనగర్, ఖమ్మం వంటి ప్రాంతాల్లో కూడా బంగారం, వెండి ధరలు కాస్త అటూ ఇటూగా ఇలానే ఉన్నాయి.

Gold And Silver Prices Today: అదేవిధంగా దేశరాజధాని ఢిల్లీ లో 22 క్యారెట్ల బంగారం ధరలు 10 గ్రాములకు స్థిరంగా  71,500 రూపాయలుగా ఉంది. అలాగే, 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు మార్పులేకుండా  77,990 రూపాయల వద్దకు చేరుకుంది. అలాగే వెండి ధరల విషయానికి వస్తే కేజీ వెండి ఢిల్లీలో కూడా ఎలాంటి మార్పు లేకుండా  92,400 రూపాయల వద్ద కొనసాగుతోంది. 

ALSO READ  Ayushman Cards: ఆయుష్మాన్ వయ వందన.. రికార్డ్ స్థాయిలో వృద్ధులకు ప్రయోజనం!

అంతర్జాతీయంగా చూసుకుంటే భారీగా పెరుగుదల కనబరిచిన  బంగారం ధరలు పెరుగుదల కనబరుస్తున్నాయి.  ఈరోజు అంటే 30.12.2024 ఉదయం 6 గంటల సమయానికి అంతర్జాతీయంగా బంగారం ధరలు పెరుగుదల నమోదు చేస్తున్నాయి.  దీంతో 10 గ్రాముల బంగారం ధర 72,000 రూపాయలుగా ఉంది. అదేవిధంగా వెండి ధరలు భారీ తగ్గుదల నమోదు చేస్తున్నాయి. కేజీ వెండి ధర 185 రూపాయలు తగ్గుదలతో ఉంది.   దీంతో కేజీ వెండి ధర 80,544 రూపాయల వద్ద   ట్రేడ్ అవుతోంది.

గమనిక: ఇక్కడ ఇచ్చిన బంగారం ధరలు ఈరోజు అంటే 30.12.2024 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా వచ్చే మార్పులు, స్థానికంగా ఉండే డిమాండ్, స్థానిక పన్నులు వంటి కారణాలతో బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. బంగారం, వెండి కొనాలని అనుకునేటప్పుడు మీ ప్రాంతంలో రెండు మూడు దుకాణాల్లో వెరిఫై చేసుకుని నిర్ణయం తీసుకోవాల్సిందిగా మహాన్యూస్ సూచిస్తోంది

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *