Vikram Vedha Makers

Vikram Vedha Makers: శివకార్తికేయన్‌తో విక్రమ్ వేద మేకర్స్ భారీ ప్రాజెక్ట్?

Vikram Vedha Makers: సినీ లోకంలో మరో సంచలనం రేపే కాంబినేషన్‌కు రంగం సిద్ధమవుతోంది. దర్శక ద్వయం పుష్కర్-గాయత్రి, శివకార్తికేయన్‌తో కలిసి కొత్త చిత్రం కోసం చర్చలు జరుపుతున్నారని సమాచారం. ‘విక్రమ్ వేద’ వంటి బ్లాక్‌బస్టర్‌తో తమ సత్తా చాటిన పుష్కర్-గాయత్రి, తమదైన స్టైలిష్ కథనం, టెక్నికల్ ఫైనెస్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. మరోవైపు, శివకార్తికేయన్ తన యాక్టింగ్, వైవిధ్యమైన పాత్రలతో కోలీవుడ్‌లో టాప్ హీరోగా ఎదుగుతున్నాడు. ఈ కాంబో ఒక్కటైతే, సినిమా కచ్చితంగా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ చిత్రం యాక్షన్ థ్రిల్లర్ లేదా డార్క్ కామెడీ జోనర్‌లో ఉండొచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. శివకార్తికేయన్ ఎనర్జీ, పుష్కర్-గాయత్రి కథాగమనం కలిస్తే, ప్రేక్షకులకు విజువల్ ట్రీట్ గ్యారెంటీ.ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కానీ, ఈ టాక్ సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Ram Charan RC 16: ఏమున్నాడ్రా బాబు..! బాక్సాఫీస్ బద్దలే..! RC 16 నుంచి చరణ్ ఫస్ట్.. టైటిల్ వచ్చేసింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *