Gautam Gambhir : ఐపీఎల్ తర్వాత టీమిండియా ఇంగ్లాండ్‌లో పర్యటించనుంది. ఆ దేశంతో ఐదు టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది. ఈ సిరీస్ కోసం బీసీసీఐ ఇప్పటికే టీమ్‌ను సైతం ప్రకటించింది. టెస్టులకు రోహిత్, విరాట్ రిటైర్మెంట్ ప్రకటించడంతో కొత్తవారికి బీసీసీఐ అవకాశం ఇచ్చింది. ఇందులో ఐపీఎల్లో రాణించిన సాయి సుదర్శన్‌కు ప్లేస్ దక్కింది. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ, ఐపీఎల్లో అదరగొడుతున్న శ్రేయస్ అయ్యర్‌కు మాత్రం సెలక్షన్ కమిటీ మొండిచెయి చూపించింది.
బీసీసీఐ టీమ్‌ను ప్రకటించినప్పటి నుంచి శ్రేయస్‌ను తీసుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. పలువురు మాజీ క్రికెటర్లు సైతం శ్రేయస్‌ను తీసుకోకపోవడం ఆశ్చర్యం కలిగించిందంటూ వ్యాఖ్యానించారు. మరోవైపు టీమిండియా కోచ్‌గా ఉన్న గంభీర్ వల్లే శ్రేయస్‌కు చోటు లభించలేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఇదే విషయంపై గంభీర్‌ను ప్రశ్నించగా.. నేను సెలక్టర్‌ను కాదు అనే జవాబిచ్చాడు. అయితే టీమ్ ఎంపికలో కోచ్, కెప్టెన్లు కీలకం వ్యవహరిస్తారనే విషయం అందరికీ తెలిసిందే.
Also Read: IPL 2025 Qualifier 2: క్వాలిఫయర్-2కి ముంబై.. ఇంటికి గుజరాత్..
Gautam Gambhir : ఈ క్రమంలో మాజీ క్రికెటర్ అతుల్ వాసన్ సంచలన కామెంట్స్ చేశాడు. గంభీర్ సెలక్ట్ చేయడు.. కేవలం రిజెక్ట్ మాత్రమే చేస్తాడు అని విమర్శించాడు. టీమ్ ఎంపికలో కోచ్ పాత్ర ఉంటుందని.. శ్రేయస్‌ను ఎందుకు తీసుకోలేదో గంభీర్ క్లారిటీగా చెప్తే బాగుండేందని అభిప్రాయపడ్డాడు. అటు చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ సైతం శ్రేయస్ అంశంపై పెద్దగా స్పందించలేదు. కొన్ని కారణాలతో అతడిని తీసుకోలేదు అని మాత్రమే చెప్పాడు.