Game Changer: రామ్ చరణ్ అభిమాని రాబోయే చిత్రం గేమ్ ఛేంజర్ మేకర్స్‌కి బహిరంగ లేఖ రాశారు. ‘RIP లెటర్’ పేరుతో ఉన్నలెటర్లో, సినిమా ట్రైలర్‌ను విడుదల చేయాలని మేకర్స్‌ను కోరారు. గేమ్ ఛేంజర్ చిత్ర బృందం అలా చేయడంలో విఫలమైతే, నేను ఆత్మహత్య చేసుకొని చనిపోతానంటూ లేఖలో పొందుపరిచాడు.
వివరాల్లోకివెళితే “మీరు అభిమానుల మనోభావాలను పరిగణనలోకి తీసుకోవడం లేదు. ఈ నెల చివరిలోగా టీజర్‌ను లేదా అప్‌డేట్‌ను విడుదల చేయకుంటే,అలానే కొత్త సంవత్సరం సందర్భంగా ట్రైలర్‌ను విడుదల చేయకపోయిన, నేను ఆత్మహత్య చేసుకోవడమే కాకుండా కఠిన చర్యలు తీసుకోవలసి వస్తుందని మీకు తెలియజేయడానికి చింతిస్తున్నాను” అని లేఖలో పేర్కొన్నాడు,
ఇది కూడా చదవండి: Pawan Kalyan: అల్లు అర్జున్ అరెస్ట్ పై పవన్ షాకింగ్ రియాక్షన్
Game Changer: గేమ్ ఛేంజర్ లాంటి పొలిటికల్ థ్రిల్లర్ ని తెరకెక్కించడంలో ప్రముఖ దర్శకుడు ఎస్ శంకర్ చాలానే కష్టపడినట్లు తెలుస్తుంది. ఇందులో కియారా అద్వానీ కథానాయికగా నటిస్తోంది. గేమ్ ఛేంజర్ టీజర్ ఈ సంవత్సరం ప్రారంభంలో విడుదలైంది, ఈ చిత్రంలో రామ్ చరణ్ అవినీతి వ్యవస్థను మార్చే ఐఎఎస్ అధికారి పాత్రలో నటిస్తున్నాడు,
Game Changer: ఇటీవల, పుష్ప 2: ది రూల్ దర్శకుడు సుకుమార్ గేమ్ ఛేంజర్ గురించి తన అభిప్రాయాన్నివెల్లడించాడు. డల్లాస్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో చిత్ర నిర్మాత మాట్లాడుతూ, “నేను చిరంజీవి సర్‌తో గేమ్ ఛేంజర్ చూశాను. నేను మొదటి రివ్యూ ఇవ్వాలనుకుంటున్నాను.1స్ట్ హాఫ్ , అద్భుతం. ఇంటర్వెల్, బ్లాక్ బస్టర్. నన్ను నమ్మండి. సెకండాఫ్, ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ నాకు గూస్‌బంప్‌లను ఇచ్చింది-అద్భుతమైన నటనతో చరణ్ ఆకట్టుకోబోతున్నారు అని సుకుమార్ అతను చాలా బాగా నటించాడు, ఖచ్చితంగా జాతీయ అవార్డు వస్తుంది.అని చెప్పుకొచ్చారు.
గేమ్ ఛేంజర్ 2021లోనే ప్రకటించిన, కమల్ హాసన్ ఇండియన్ 2 సినిమా కారణంగా చాలా ఆలస్యం అయింది. ఈ చిత్రం ఎట్టకేలకు జనవరి 10, 2025న తెలుగు, తమిళం, హిందీలో థియేటర్లలోకి రానుంది