Game Changer: గేమ్‌చేంజర్ సినిమా టికెట్ రేట్ల పెంపు, అదనపు షోల నిర్వహణపై హైదరాబాద్ వాసి రాష్ట్ర హైకోర్టులో వేసిన పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరుగుతుంది. ఈ మేరకు గురువారం విచారణను స్వీకరించిన న్యాయమూర్తి నేటికి వాయిదా వేశారు. పుష్ప 2 సినిమా ఫిర్యాదుతో కలిపి విచారించనున్నట్టు తేల్చి చెప్పింది. ఈ విషయంలో సర్కారు వైఖరిని తప్పుబట్టింది. పుష్ప 2 ఘటన జరిగిన తర్వాత అయినా కనువిప్పు కలగలేదా? అని ప్రశ్నించింది.
Game Changer: శంకర్ దర్శకత్వంలో, దిల్‌రాజు నిర్మాతగా రాంచరణ్, కియారా అద్వానీ నటించిన గేమ్‌చేంజర్ సినిమా ఈ రోజే జనవరి 10న విడుదలవుతుంది. అయితే ఈ సినిమాకు తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు, అదనపు షోలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.ఈ మేరకు హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి రవిగుప్తా ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో ఐదు రోజులపాటు 5 షోలకు అనుమతితోపాటు ఈ నెల 19వరకు అదనపు టికెట్ రేట్లను అనుమతి ఇచ్చారు.
Game Changer: ఈ నేపథ్యంలో టికెట్ రేట్ల పెంపు, అదనపు షోల నిర్వహణపై హైదరాబాద్ కూరగాయల వ్యాపారి గొర్రె భరత్‌రాజ్ గురువారం లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి విచారణకు స్వీకరించారు. ఫిర్యాదుదారు తరఫు లాయర్ వాదనలు విన్న తర్వాత అసలు బెనిఫిట్ షోల అవసరమేమున్నది అని హైకోర్టు ప్రశ్నించింది. ప్రజల భద్రత గురించి పట్టించుకోరా? అని ప్రశ్నించింది.
Game Changer: సినిమా ప్రదర్శనకు సమయపాలన ఉండాలి అని, అర్ధరాత్రి, అపరాత్రి వేయడమేమిటని ప్రశ్నించింది. ఇది మానవ హక్కుల ఉల్లంఘనే అవుతుందని, 16 ఏండ్ల లోపు పిల్లలను అర్ధరాత్రి, తెల్లవారుజామున సినిమాకు అనుమతించరాదని తెలిపింది. ఈ విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు. ఈ రోజు మళ్లీ విచారణ చేపట్టనుండటంతో అంతటా ఉత్కంఠ నెలకొన్నది. ఈ నేపథ్యంలో సినిమా ఇదేరోజు విడుదలై ప్రదర్శించబడుతున్నది.