Google Maps: కొన్నేళ్ల క్రితం ఎక్కడికైనా వెళితే, ఎడ్రస్ తెలియకపోతే రోడ్డు మీద ఉన్న వారిని అడిగి తెలుసుకునే వాళ్ళం. వారు చెప్పిన గుర్తుల ఆధారంగా ఎక్కడికి చేరుకోవాలో అక్కడికి చేరుకునే వాళ్ళం. కానీ, ఇప్పుడు గూగుల్ వచ్చేసింది. ఎక్కడికి వెళ్లాలన్నా సరే గూగుల్ మ్యాప్ లో సెర్చి.. ఫోన్ లో దారి చూసుకుంటూ.. అది చెప్పే రైట్, లెఫ్ట్ లను వింటూ దూసుకుపోతున్నాం. కానీ, ఒక్కోసారి గూగుల్ మ్యాప్స్ కూడా తప్పుదారి పట్టిస్తాయి. అదిగో ఒక పోలీసు బృందాన్ని గూగుల్ తప్పుదారి పట్టించడంతో వారంతా ఒక ప్రాంతానికి చేరబోయి ఇంకో ప్రాంతంలో తేలారు. అక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. ఏమి జరిగిందో వివరంగా తెలుసుకుందాం.
అస్సాంలోని జోర్హాట్ పోలీసుల 16 మంది సభ్యుల బృందం ఒక నిందితుడిని అరెస్టు చేయడానికి బయలుదేరింది. గూగుల్ ఆదేశాల మేరకు ముందుకు సాగింది. కానీ దారి తప్పి నాగాలాండ్‌లోని మోకోక్‌చుంగ్ జిల్లాకు చేరుకుంది. ఇక్కడి ప్రజలు పోలీసు బృందాన్ని చొరబాటుదారులుగా భావించి వారిపై దాడికి పాల్పడ్డారు. వారిని రాత్రంతా బందీలుగా ఉంచారు. ఈ ఘటన మంగళవారం జరిగింది. నిజానికి ఇదంతా గూగుల్ మ్యాప్ వల్లే జరిగింది. పోలీసు బృందం అస్సాంలోని ఒక తీ ఎస్టేట్ కు చేరాలి. కానీ, అది నాగాలాండ్‌లోని టీ గార్డెన్ కి తీసుకుపోయింది. అది అస్సాంలో ఉన్నట్లు గూగుల్ చూపించింది.
ఇది కూడా చదవండి: Meerut Mysterious Deaths: అయ్యో.. గొంతుకోసి కుటుంబం మొత్తాన్ని చంపేశారు!
Google Maps: ఈ విషయం తెలుసుకున్న జోర్హాట్ పోలీసులు మోకోక్‌చుంగ్ ఎస్పీని ఆశ్రయించారు. దీని తరువాత, మోకోక్‌చుంగ్ పోలీసులు ఈ వ్యక్తులను విచారించడానికి ఒక బృందాన్ని పంపారు. నాగాలాండ్ ప్రజలకు విషయం తెలియడంతో, వారు గాయపడిన వారితో సహా 5 మందిని విడుదల చేశారు, మిగిలిన 11 మందిని రాత్రిపూట బందీలుగా ఉంచి మరుసటి రోజు విడుదల చేశారు.
అదండీ సంగతి.. గూగుల్ మ్యాప్స్ ను నమ్ముకుంటే అలా జరిగే అవకాశాలుంటాయన్న మాట.
సివిల్ డ్రెస్ -ఆయుధాల వల్ల గందరగోళం
మోకోక్‌చుంగ్‌లోని స్థానిక ప్రజలు అస్సాం పోలీసు బృందాన్ని అత్యాధునిక ఆయుధాలు కలిగి ఉన్న దుర్మార్గులుగా భావించారు. ఎందుకంటే వారిలో ముగ్గురు మాత్రమే యూనిఫాంలో ఉన్నారు – మిగిలిన వారు సివిల్ డ్రెస్‌లో ఉన్నారు. దీంతో కూడా గందరగోళం నెలకొంది. వారు జట్టుపై కూడా దాడి చేశారు, ఒక పోలీసు గాయపడ్డారు.
ఈ గూగుల్‌ని గుడ్డిగా నమ్మడం సరికాదు..
గూగుల్ మ్యాప్‌ను గుడ్డిగా నమ్మడం సరికాదు. కొన్నిసార్లు కొన్ని కారణాల వల్ల మ్యాప్ తప్పు మార్గాన్ని చూపుతుంది. ఉదాహరణకు, Google మ్యాప్‌లో అప్‌డేట్ చేయని కొత్త రహదారిని నిర్మించినట్లయితే, అది తప్పు సమాచారాన్ని అందించవచ్చు. భారీ వర్షం, తుఫాను కారణంగా రహదారి క్లోజ్ అయి ఉండవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా గూగుల్ మ్యాప్ తప్పుడు సమాచారం ఇవ్వగలదు. Google Map GPS సిగ్నల్స్ ద్వారా పని చేస్తుంది.ఒక్కోసారి నెట్‌వర్క్ లేకపోయినా, తప్పుడు సమాచారం ఇవ్వవచ్చు.