HMPV: హెచ్ఎంపీవీ వైరస్ ప్రపంచ వ్యాప్తంగా భయాందోళన కలిగిస్తున్నది. దేశంలో కూడా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ వస్తున్నది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టింది. ఇప్పటికే పలు జాగ్రత్తలను ప్రచారం చేస్తూ వస్తున్నది. వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, ఆ శాఖ కార్యదర్శి ప్రజలకు పలు సూచనలు చేశారు. అసత్య ప్రచారాలను నమ్మవద్దని కోరారు. ఎవరూ వ్యాప్తి చేయవద్దని హెచ్చరించారు.
HMPV: ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్తగా హైదరాబాద్ గాంధీ దవాఖానలో హెచ్ఎంపీవీ ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేసి ఉంచింది. ఈ మేరకు ప్రత్యేకంగా 40 పడకలతో కూడిన వార్డులను ఏర్పాటు చేసింది. కరోనా కాలంలో కూడా గాంధీ పెద్ద ఎత్తున ప్రజలకు సేవలందించింది. వైద్యులు, సిబ్బంది కూడా తమ శక్తికి మించి తమ ప్రాణాలను పణంగా పెట్టి ప్రజలను ప్రాణాలను కాపాడారు. ఇప్పడు హెచ్ఎంపీవీతో ఎలాంటి ప్రమాదం లేకుండా బాధితులకు సరైన వైద్యం అందించేందుకు ఈ ఏర్పాట్లు చేస్తున్నట్టు అక్కడి వైద్యులు పేర్కొన్నారు.