Game changer: స్టార్ డైరెక్టర్ శంకర్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కీయార అద్వానీ హీరోయిన్ గా తెరకెకబోతున్న సినిమా గేమ్ చేంజర్. ప్రస్తుతం ఈ సినిమాపై టాలీవుడ్ వ్యాప్తంగా భారీ అంచనాలను నెలకొన్నాయి. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు భారీ బడ్జెట్లో సినిమాను నిర్మించారు. తమ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిచము కాస్త టికెట్ రాట్లు పెంపునకు అనుమతి ఇవ్వండి అని ప్రభుత్వాన్ని చిత్ర యూనిట్ అతి చేయగా సర్కార్ అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
గేమ్ ఛేంజర్ టికెట్ రేట్లను పెంపుకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రాత్రి ఒంటిగంట బెనిఫిట్ షో ఏర్పాటు చేసుకోవచ్చని.. టికెట్ ధర 600 రూపాయలు చేసింది. జనవరి 10 నుంచి జనవరి 23 వరకు 5 షోస్ కు టెక్కెట్ రేట్లు పెంపు కు అనుమతి ఇస్తున్నట్టు స్టాంప్ వేసింది. మల్టీప్లెక్స్ టికెట్ కు అదనంగా 175 రూపాయలు, సింగిల్ స్క్రీన్స్ లో టికెట్ కు అదనంగా 135 రూపాయలు పెంపు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.
కాగా, తెలంగాణ ప్రభుత్వం మాత్రం సినిమాలకు బెనిఫిట్ షోలు టికెట్ రేట్లు పెంపునకు అనుమతి ఇవ్వమని ఇదివరకే చెప్పింది. సంధ్య థియేటర్లో సినిమా విడుదల సందర్భంగా జరిగిన ఘటన పై ప్రభుత్వం తీసుకున్న చర్యలు కొనసాగిస్తానని ఇదివరకే చెప్పింది. దీంతో తెలంగాణలో టికెట్ రేట్లు పెంపు ఉండదని స్పష్టమవుతుంది.