Haryana: హర్యానాలోని పానిపట్‌లో జరిగిన పెళ్లి వేడుకలో పెళ్ళికొడుకు ఊరేగింపు కార్యక్రమం వివాదాస్పదమైంది. ఊరేగింపు సందర్భంగా కొంతమంది పెళ్లికొడుగు వాహనంపై ఎక్కి తుపాకీతో గాలిలో కాల్పులు జరిపారు. అంతేకాకుండా, ఊరేగింపులో కొంతమంది పిస్టల్స్ .. డోగా అంటే డబుల్ బారెల్ తుపాకీలను ఊపుతూ డాన్సులు వేశారు. తరువాత ఈ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో అవి వైరల్ గా మారాయి. ఈ వీడియోలను చూసిన పోలీసులు పెళ్లి ఊరేగింపుపై కేసు నమోదు చేశారు. గాలిలో కాల్పులకు పాల్పడడం, ఆయుధాలతో గందరగోళం చేసిన వ్యక్తులను గుర్తించి అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, డ్యాన్సర్లలో కొంతమంది అబ్బాయిలు చేతిలో పిస్టల్స్‌తో గాలిలోకి కాల్పులు జరుపుతున్నారు. ఒక బడబుల్ బారెల్ తుపాకీని గాలిలో ఊపుతున్నాడు. వేడుకల వాతావరణంలో గాలిలోకి కాల్పులు జరుపుతూ ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించారు. ఆ వీడియోను పరిశీలించగా నవంబర్ 10వ తేదీకి సంబంధించిన వీడియో అని తేలింది.
ఇది కూడా చదవండి: Road Accident: హైవేపై ట్రక్కు బీభత్సం.. 5గురు మృతి
Haryana: ఈ ఊరేగింపు పసినా ఖుర్ద్ గ్రామానికి చెందిన జాకీర్ ఇంట్లో పెళ్లి వేడుకలో ఈ ఘటన జరిగినట్టు పోలీసులు గుర్తించారు. దాడోలా నివాసి అయిన గయూర్ పెళ్లి ఊరేగింపులో పిస్టల్‌తో గాలిలోకి కాల్పులు జరిపాడు. ఊరేగింపులో ఉన్న ఇతర వ్యక్తులు బహిరంగ ప్రదేశంలో ప్రజల మధ్య పిస్టల్స్ .. డోగా తుపాకీలను గాలిలో ఊపుతూ కాల్చారు. దీంతో ప్రజల్లో భయాందోళన నెలకొంది.