America: ఉత్తర అమెరికాలో తెలుగు సినిమా సత్తా చాటుతోంది. ఇక ఇక్కడ అత్యధిక వసూళ్ళు సాధించిన భారతీయ చిత్రాల్లో మొదటి రెండు ప్లేస్ లలో నిలిచింది తెలుగు సినిమాలే. అవే ‘బాహుబలి2’, ‘కల్కి2898ఎడి’. ఇక ఈ ఏడాది ఉత్తర అమెరికాలో తెలుగు సినిమాలకు ల్యాండ్ మార్క్ ఇయర్ గా నిలిచిపోనుంది. క్యాలండర్ ఇయర్ లో తెలుగు సినిమాల వసూళ్ళు 50 మిలియన్ డాలర్స్ మార్క్ ను దాటబోతుందటం విశేషంగా చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకూ ఈ ఏడాది ఉత్తర అమెరికాలో విడుదలైన తెలుగు సినిమాల నుంచి దాదాపు 43 మిలియన్ డాలర్స్ గ్రాస్ వసూలు అయింది. ‘కల్కి 2898ఎడి’ 18.57, ‘దేవర’ 6.01, ‘హనుమాన్’ 5.26, టిల్లు స్వ్కేర్ 2.93, ‘గుంటూరు కారం’ 2.63, ‘సరిపోదా శనివారం’ 2.5 మిలియన్ డాలర్స్ వసూలు చేశాయి. ఇక ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న ‘పుష్ప2: ది రూల్’ డిసెంబర్ 5న విడుదల కాబోతోంది. ఈ సినిమాపై ఉన్న భారీ అంచనాలతో 60 మిలియన్ డాలర్స్ మార్క్ ను ఈజీగా దాటే అవకాశం ఉంది. ఈ భారీ వసూళ్ళకు కోవిడ్ తర్వాత అమెరికా వెళ్ళిన తెలుగు వారి సంఖ్య భారీగా పెరగటమే అని, విద్యార్థులు, వారి బంధుగణం వల్లే ఈ స్థాయి వసూళ్ళు అని ట్రేడ్ వర్గాలంటున్నాయి. వచ్చే ఏడాది ఈ సంఖ్య మరింత పెరుగుతుందేమో చూడాలి మరి.