Ponnam Prabhakar: సమగ్ర కుల గణన ప్రక్రియ ఈనెల 6న ప్రారంభం..

Ponnam Prabhakar: సమగ్ర సర్వే సక్రమంగా జరిగి భవిష్యత్‌లో అందరికి సమ న్యాయం జరిగేలా అందరు సహకరించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో భాగంగా రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు.. దేశంలో మొదటిసారి సమగ్ర కుల గణన ప్రక్రియ ఈనెల 6 వ తేదిన ప్రారంభమవుతుందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి బుధవారం ఆయన గాంధీభవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారున్నారు.దీనికి సంబంధించి త్వరలో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు.

క్షేత్ర స్థాయిలో ఉన్న కాంగ్రెస్ నాయకులు కూడా గ్రామీణ ప్రాంతాలలో అధికారులకు సహకరించాలని సూచించారు.150 ఇళ్లకు అధికారుల బృందం సమగ్ర సమాచార సేకరణ చేపడుతుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు అన్ని రకాలుగా అందుబాటులో ఉండాలన్నారు. ఈ సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి కూడా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ..బీసీ కులగణన జరగాలన్న హామీకి తామంతా కట్టుబడి ఉన్నామని మంత్రి కోమటరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.బీసీ కుల గణన తెలంగాణ లో చరిత్ర సృష్టించబోతోందని తెలిపారు.రైతు రుణమాఫీ గురించి మాట్లాడే కనీస అర్హత హరీశ్‌రావు కు లేదని ఆయన మండిపడ్డారు. స్పష్టం చేశారు. రాష్ట్రంలో విపక్షాలు కేవలం ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నాయని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Sana satish: వైసీపీ తో సానా సతీష్ డీల్..తమ్ముళ్లు సీరియస్..:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *