Fire Accident: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ సమీపంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకున్నది. నిర్మాణంలో ఉన్న అమర్‌రాజా బ్యాటరీస్ కంపెనీ భవనంలో సోమవారం సాయంత్రం మంటలు చెలరేగాయి. మూడో అంతస్తులో మంటలు ఎగిసిపడి గ్రౌండ్ ఫ్లోర్‌లోకి వ్యాపించాయి. ఈ సమయంలో అక్కడి పనిచేసే సిబ్బంది బయటకు పరుగులు తీశారు.
Fire Accident: నిర్మాణంలో ఉన్న భవనం గ్రౌండ్ ఫ్లోర్‌లోని విద్యుత్ ట్రాన్స్‌మీటర్ ఉన్న గది కూడా పూర్తిగా దహనమైంది. ఈ మేరరకు అగ్నిమాపక సిబ్బందికి ఇచ్చిన సమాచారం మేరకు సకాలంలో వచ్చారు. మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగిందా? లేక మేరేదైనా కారణం కావచ్చా? అన్న విషయాలను ఆరా తీస్తున్నారు.