Chhattisgarh: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని అటవీ ప్రాంతంలో భారీ ఎన్‌కౌంటర్ కొనసాగుతున్నది. కంకేర్, నారాయణపూర్ జిల్లాల సరిహద్దులోని మాద్ ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టుల మధ్య ఈ ఎన్‌కౌంటర్ జరుగుతున్నది. ఈ ఎన్‌కౌంటర్‌ను ఆ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ ఐకే ఎలిసెలా ధ్రువీకరించారు. ఈ సమయంలో మావోయిస్టుల్లో కీలక నేతలు ఉన్నట్టు సమాచారం. ఈ సమాచారంతోనే పోలీసులు అటాక్ చేశారని వినికిడి.
Chhattisgarh: ఈ ఎన్‌కౌంటర్ పలువురు మావోలు మరణించినట్టు తెలుస్తున్నది. అయితే అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉన్నది. ఘటనా స్థలం నుంచి ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. ఇంకా పోలీసులకు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నట్టు సమాచారం అందుతున్నది.