Harudu Glimpse

Harudu Glimpse: ఆర్జీవీ ఆవిష్కరించిన ‘హరుడు’ గ్లింప్స్

Harudu Glimpse: డాక్టర్ లక్ష్మణరావు డిక్కల, డాక్టర్ ప్రవీణ్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘హరుడు’. శ్రీహరి, హెబ్బా పటేల్, వెంకట్ ఇందులో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. రాజ్ తాళ్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు చురుగ్గా సాగుతున్న ఈ చిత్రం నుంచి తాజాగా లీడ్ రోల్ చేస్తున్న శ్రీహరి ఫస్ట్ లుక్ పోస్టర్, గ్లింప్స్ను డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ విడుదల చేసి టీమ్కు ఆల్ ద బెస్ట్ చెప్పారు. ఈ పోస్టర్లో శ్రీహరి ఇంటెన్స్ లుక్లో ఆకట్టుకున్నారు. చిత్ర నిర్మాణ రంగంలోకి శ్రీహరి ప్రోద్బలంతో అడుగు పెట్టామని, ఈ సినిమా తప్పకుండా అందరినీ మెప్పిస్తుందని నిర్మాత లక్ష్మణరావు తెలిపారు. ఇందులో సలోని, అలీ, సుమన్ కీలక పాత్రలు పోషించారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  LIfe Stories Movie: చిన్న సినిమాగా వచ్చి.. రెండువారాలుగా థియేటర్లలో సందడి చేస్తున్న లైఫ్ స్టోరీస్!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *