Emmanuel Macron: వియత్నాం పర్యటనలో ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ దంపతుల మధ్య చోటు చేసుకున్న ఓ చిన్న సంఘటన ఇప్పుడు అంతర్జాతీయంగా దృష్టిని ఆకర్షిస్తోంది. ఆయన భార్య బ్రిగిట్టే మెక్రాన్ చేసిన హఠాత్ చర్యపై వీడియో వైరల్‌గా మారింది.
వియత్నాం రాజధాని హనోయ్‌లోని ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో విమానం దిగుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఫ్లైట్ డోర్ తెరుచుకున్న తర్వాత, బ్రిగిట్టే మెక్రాన్ తన భర్త ముఖాన్ని రెండు చేతులతో వెనక్కి నెట్టి, ఆయన కొంచెం తడబడ్డట్లు కనిపించారు. ఆ దృశ్యాన్ని అక్కడే ఉన్న మీడియా కెమెరాలు రికార్డ్ చేశాయి. మెక్రాన్ అప్పటికప్పుడు తేరుకుని, అక్కడికి స్వాగతానికి వచ్చిన అధికారులతో అభివాదాలు చేస్తూ ముందుకు సాగిపోయారు.
ఈ ఘటనపై వచ్చిన సోషల్ మీడియా ట్రోల్స్, విమర్శల మధ్య… ఫ్రాన్స్ అధ్యక్ష భవనం (ఎలిసీ ప్యాలెస్) స్పందించింది. “ఇది మెక్రాన్ దంపతుల మధ్య సరదా పరచిన చిన్న సన్నివేశం మాత్రమే. వారిద్దరి మధ్య సాన్నిహిత్యాన్ని తెలియజేసే విషయమిది” అని పేర్కొంది. అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం, దీన్ని ‘తేలికపాటి చిలిపి గొడవ’గా చూడాలని, దీనిలో తతంగం వెతకవద్దని అధికారులు సూచించారు.
ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతుంది. “ఫ్రాన్స్ అధ్యక్షుడిపై భార్య చేయి చేసుకుందా?” అనే ప్రశ్నలతో చర్చలు వెల్లువెత్తుతున్నాయి. విమానం దిగేటప్పుడు మెక్రాన్ తన భార్యకు చేయి అందించగా, ఆమె తిరస్కరించినట్లు వీడియోలో కనపడడంతో జంట మధ్య విరోధం ఉందన్న భావనకొచ్చింది. కానీ నిజానికి ఇది ఆ జంట మధ్య స్నేహపూరితంగా జరిగిన సన్నివేశమేనని చెబుతున్నారు.
Also Read: Viral News: పర్యాటకుడిపై రాయి విసిరిన చింపాంజీ పిల్ల.. అది చూసిన తల్లి చింపాంజీ ఏం చేసింది అంటే..?
Emmanuel Macron: ఇది మెక్రాన్‌కు మొదటిసారి కాదు. గతంలో కూడా ఆయన ప్రజలతో కరచాలనం చేసేందుకు వెళ్తున్నప్పుడు ఓ వ్యక్తి చాకచాకా చెంపపై కొట్టిన ఘటన జరిగింది. కానీ ఈసారి తన భార్య చేయి చేసిందన్న ప్రచారం మరింతగా వైరల్ కావడానికి దారి తీసింది. దీనిపై స్పందించిన మెక్రాన్ – “ఇది సరదా మాత్రమే, మాది సాధారణ భార్యాభర్తల ముచ్చట” అని తెలిపారు.
ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ ప్రస్తుతం వారం రోజుల ఆగ్నేయాసియా పర్యటనలో ఉన్నారు. ఇందులో భాగంగా వియత్నాంలో ప్రారంభించి, ఇండోనేసియా, సింగపూర్‌లకు కూడా వెళ్లనున్నారు. ఈ పర్యటన ప్రారంభమైనప్పుడే జరిగిన ఈ సంఘటన హడావుడి సృష్టించినా, అందులో ఎలాంటి దురుద్దేశం లేదని అధికారిక వర్గాలు స్పష్టంచేశాయి.
Macron, blink twice if you need help. pic.twitter.com/BRCEert9Rg
— End Wokeness (@EndWokeness) May 26, 2025