Crime News:కొందరు పోలీసులు అతి చేస్తుంటారు.. అధికారం ఉంది కదా అని పౌరులపై తమ ఇష్టారీతిన ప్రవర్తిస్తుంటారు.. ఆ అతి పౌరుల ప్రాణాలమీదికి వస్తుంది.. ఇక్కడా ఆ అతే ఓ చిన్నారి ప్రాణాన్ని బలితీసుకున్నది.. తమ కూతురుతో కలిసి వెళ్తున్న దంపుతల బైక్‌ను హెల్మెంట్ లేదన్న సాకుతో రోడ్డుపై ఉన్న ట్రాఫిక్ పోలీసులు ఆపాలని ప్రయత్నించారు. ఈ కారణంగానే ఓ చిన్నారి నిండు ప్రాణం కానరాని లోకాలకు వెళ్లింది.
Crime News:కర్ణాటక రాష్ట్రంలోని మద్దూరు మండలం గొరవనహళ్లి గ్రామానికి చెందిన అశోక్, వాణి దంపతులు తమ కుమార్తె ప్రతీక్షను వైద్యం కోసం మాండ్య జిల్లాలోని మెడికల్ కళాశాల ఆసుపత్రికి బైక్‌పై తీసుకెళ్తున్నారు. అశోక్‌కు హెల్మెట్ ధరించలేదని మాండ్య మండల కేంద్రంలోని నంద సర్కిల్ వద్ద ట్రాఫిక్ పోలీసులు వారి బైక్‌ను ఆపడానికి హడావుడి చేశారు. దీంతో బైక్ అదుపు తప్పి రోడ్డుపై వారంతా పడిపోయారు.
Crime News:రోడ్డుపై పడిన సమయంలో ప్రతీక్ష పైనుంచి వెనుకగా వస్తున్న టెంపో దూసుకెళ్లింది. దీంతో ఆ చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలిడిసింది. పోలీసుల తీరుకు నిరసనగా ఆ బాలిక తల్లిదండ్రులు, స్థానికులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తంచేశారు. బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Crime News:విషయం తెలిసి ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి వచ్చారు. బాలిక మృతికి గల కారణాలను తెలుసుకున్నారు. బాధ్యులైన ట్రాఫిక్ పోలీసులను అక్కడికక్కడే వెంటనే సస్పెండ్ చేస్తూ ఆదేశాలను జారీచేశారు. పోలీసుల అతి ఓ నిండు ప్రాణాన్నే బలి తీసుకున్నది. ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నా, ఇతర పోలీసు అధికారుల్లో మార్పు రావడమే లేదు.