National News: దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో, తీరప్రాంతం అధికంగా ఉన్న గుజరాత్ రాష్ట్రంలో డ్రగ్స్ దందా విచ్చలవిడిగా కొనసాగుతుండటం ఆందోళనకర రీతిలో పట్టుబడుతూ సవాల్ విసిరుతోంది. తాజాగా ఢిల్లీ నగరంలో రూ.900 కోట్ల విలువైన 90 కిలోల కొకైన్ డ్రగ్స్ పట్టుబడి మరింత ఆందోళన కలిగిస్తున్నది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు డ్రగ్స్ రవాణాను పట్టుకొని నిందితులను అరెస్టు చేశారు. అయితే ఒక కొరియర్ ఆఫీసులో ఈ డ్రగ్స్ పట్టుబడటం అనుమానాలకు తావిస్తున్నది.
National News: గత కొంతకాలంగా ఈ డ్రగ్స్ కొరియర్ ద్వారా విదేశాలకు ఎగుమతి, దిగుమతులు సాగుతున్నదన్న విషయాలపై ఎన్సీబీ అధికారులు విచారిస్తున్నారు. న్యూఢిల్లీలోని నాంగ్లోయ్, పశ్చిమ ఢిల్లీలో ఆస్ట్రేలియా నుంచి వచ్చిన 82 కిలోల కొకైన్‌ను వారు పట్టుకున్నారు. ఢిల్లీ, సోనిపట్‌కు చెందిన నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. గత అక్టోబర్ నెలలోనే రూ.5,620 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను ఢిల్లీ నగరంలో పట్టుబడటం.. డ్రగ్స్‌కు అడిక్ట్ అయిన వారి సంఖ్య పెరిగిందనడానికి ఇదే నిదర్శనం.
National News: డ్రగ్స్ నిరోధక సంస్థలు గుజరాత్ తీర ప్రాంతంలో దాడులు చేసి తాజాగా 700 కిలోల మాదక ద్రవ్యాలను సీజ్ చేసి, 8 మంది ఇరానియన్లను అరెస్టు చేశాయి. ఓ నౌకలో సోదాలు జరిపితే ఈ బాగోతం బయటపడింది. అందులో దొరికిన మెటాంఫెటమైన్‌ను సీజ్ చేసింది. ఇలా వివిధ ప్రాంతాలకు విదేశాల నుంచి డ్రగ్స్ దిగుమతి అవుతుండటం ఆందోళనకరంగా మారింది.