Doctors Negligence: వైద్యుల నిర్లక్ష్యంతో పసికందు మృతి చెందిన ఘటన దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే నల్గొండ జిల్లా దేవరకొండ మండలం మర్రిచెట్టు తండా కు చెందిన మూడవత్ నందిని రాత్రి 12 గంటల సమయంలో ప్రసూతి కోసం దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చింది. ఆమెకు ఆపరేషన్ చేయగా మగ శిశువు జన్మించాడు. శిశువుకు పరిస్థితి బాగాలేదు అంటూ హైదరాబాదుకు తీసుకెళ్లాలని డాక్టర్లు సూచించారు.
ఇది కూడా చదవండి: Mega Star Chiranjeevi: అనిల్ రావిపూడి ‘మెగా’ మూవీ ఎప్పుడంటే!
Doctors Negligence: హైదరాబాద్ కి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందిందని డాక్టర్లు నిర్ధారించారు. అయితే డాక్టర్ల నిర్లక్ష్యంతోనే బిడ్డ మరణించాడని మృతి చెందిన తర్వాత తమకు సీరియస్ గా ఉంది హైదరాబాద్ కి తీసుకెళ్లాలని చెప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు.విషయం తెలుసుకున్న బంధువులు దేవరకొండ ప్రభుత్వాసుపత్రి కి చేరుకొని ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగడంతో దేవరకొండ పోలీస్ సిబ్బంది ఆస్పత్రికి చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు. డ్యూటీలో ఉన్న డాక్టర్లపైన నర్సులపైన చర్యలు తీసుకోవాలని బంధువులు డిమాండ్ చేశారు.