Janhvi Kapoor: అతిలోక సుందరి శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ నిశ్చితార్థం త్వరలో జరుగబోతోందనే వార్త బాలీవుడ్ లో గుప్పుమంది. ఆమె తన బోయ్ ఫ్రెండ్ శిఖర్ పహారియా, అతని తల్లితో కలిసి ఇటీవల తిరుపతి వెళ్ళింది. దాంతో త్వరలో జరుగబోతున్న ఎంగేజ్ మెంట్ కు భగవంతుని ఆశీస్సులు తీసుకోవడానికే వీరంత అక్కడకు వెళ్ళారనే ప్రచారం జరగుతోంది. 2023లోనూ జాన్వీ… శిఖర్ పహారియాతో కలిసి తిరుమల వెళ్ళినప్పుడు ఇలాంటి పుకార్లే షికారు చేశారు. దీనిని ఉదహారణగా చూపుతూ… జాన్వీ టీమ్ ఈ వార్తలను ఖండించింది.
ఇది కూడా చదవండి: Government Treasury: ప్రభుత్వ ఖజానాలో ‘దోపిడీ’, బంధువుల ఖాతాల్లో జమ
Janhvi Kapoor: కెరీర్ పరంగా ఉచ్ఛదశలోకి వెళుతున్న సమయంలో జాన్వీ పెళ్ళి చేసుకోవడం జరిగేది కాదని వారు అంటున్నారు. అయితే శిఖర్ తో ఉన్న స్నేహాన్ని ఆమె దాచిపెట్టాలని అనుకోవడం లేదని, జాన్వీ సోదరి ఖుషీ కపూర్ సైతం తన ప్రియుడు వేదాంగ్ రైనాతో ఓపెన్ గానే తిరుగుతుంటుందని వారు చెబుతున్నారు. నిజానికి ఇలా తమ బోయ్ ఫ్రెండ్స్ తో పబ్లిక్ ప్లేసెస్ కు వెళ్లడం వల్ల ఓ రకంగా వారు సెక్యూర్డ్ గా ఫీలవుతుంటారని సన్నిహితులు చెబుతున్నారు. ఏదేమైనా త్వరలో జాన్వీ నిశ్చితార్థం… ఆపైన పెళ్ళి అంటూ వస్తున్న వార్తలలో ఇసుమంత కూడా నిజం లేదనే భావించాలి.