Mega Star Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘విశ్వంభర’ మూవీ చేస్తున్నారు. ఏప్రిల్ లో ఇది విడుదల కాబోతోంది. అలానే అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ జనవరి 14న జనం ముందుకు వస్తోంది. చిరు – అనిల్ కాంబోలో ఓ సినిమా రూపుదిద్దుకోబోతోందనే వార్త కొద్ది రోజులుగా బలంగా వినిపిస్తోంది. దానిని బలపరుస్తూ… వీరిద్దరి సన్నిహితులు మీడియా ముందే ప్రకటనలు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: The Raja Saab: తమన్ చెప్పిన ‘రాజా సాబ్’ క్రేజీ అప్ డేట్!
Mega Star Chiranjeevi: అనిల్ రావిపూడి తయారు చేసిన కథ కు చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, దాని ఫైనల్ ట్రీట్ మెంట్ మాత్రమే బాలెన్స్ ఉందని అంటున్నారు. ఒక్కసారి ‘విశ్వంభర’ నుండి చిరంజీవి బయటకు రాగానే… అనిల్ రావిపూడితో సినిమా పట్టాలెక్కేస్తుందని చెబుతున్నారు. ఈ నెల 15న దీనికి సంబంధించిన పూజా కార్యక్రమాలు జరుగబోతున్నాయట. జూలైలో రెగ్యులర్ షూటింగ్ ను ప్రారంభించి, వచ్చే జనవరిలో సంక్రాంతి కానుకగా దీనిని విడుదల చేస్తారని టాక్!
రూ. 99 కే ‘ఫతే’ మూవీ! లాభాలూ విరాళంగా!!
Sonu Sood: ప్రముఖ నటుడు, మానవతావాది సోనూ సూద్ మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నాడు. తాను హీరోగా నటించి, దర్శకత్వం వహించిన ‘ఫతే’ మూవీని మొదటి రోజున దేశ వ్యాప్తంగా కేవలం 99 రూపాయలకు చూసే ఆస్కారాన్ని సోనూసూద్ కల్పించారు. కరోనా సమయంలో తాను దేశ వ్యాప్తంగా ఉన్న బాధితకులకు సాయం చేసే బాద్యతను భుజానికెత్తుకున్నానని, అదే సమయంలో ఎంతోమంది సైబర్ నేరగాళ్ళ బారిన పడ్డారనే విషయం తెలిసిందని అన్నారు. అలాంటి బాధితుల కథనే ‘ఫతే’లో చూపించానని చెప్పారు. ఈ సినిమాను ప్రతి ఒక్కరూ చూడాలని కోరుతూ, దీని ద్వారా వచ్చే లాభాలను సేవా కార్యక్రమాలకే వినియోగిస్తానని సోనూసూద్ అన్నారు.