AP News: పాలకొండ ఏరియా ఆస్పత్రిలోని మేల్ వార్డు బాత్‌రూంలో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం చోటు చేసుకుంది.వీరఘట్టం మండలం తలవరం గ్రామానికి చెందిన బెవర జోగినాయుడు కడుపు నొప్పితో బాధపడుతూ శనివారం పాలకొండ ఏరియా ఆసుపత్రిలో చేరాడు. అయితే ఆదివారం తెల్లవారుజామున ఆసుపత్రిలోని మేల్ మెడికల్ వార్డు బాత్ రూమ్‌లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఆసుప్రతి సిబ్బంది వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో నాలుగు పర్యాయాలు ఇదే ఆసుపత్రిలో జోగినాయుడు చికిత్స కోసం చేరాడు. కడుపునొప్పి తాళలేక ఆత్మహత్య చేసుకున్నట్టు వైద్యులు నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం గదికి తరలించారు. మృతుడి బంధువులు అక్కడకు చేరుకుని పోస్టుమార్టం చేయవద్దని ఆం దోళనకు దిగడంతో సీఐ చంద్రమౌళి వచ్చి నచ్చజెప్పారు. అనంతరం పోస్టు మార్టం నిర్వహించి జోగినాయుడు మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. మృతుడికి భార్య కల్యాణి, ఇద్దరు పిల్లలు వెంకటేష్, సూర్యకళ ఉన్నారు.