Dhanush: టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందించిన తాజా చిత్రం ‘కుబేర’ షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాలో ధనుష్, అక్కినేని నాగార్జున, రష్మిక మందన్న కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం టీజర్, పోస్టర్లు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు రేకెత్తించాయి. ఈ నేపథ్యంలో ధనుష్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో నాగార్జున గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో నాగార్జున చిత్రాలకు ఇప్పటికీ గట్టి ఫ్యాన్ బేస్ ఉందని, తాను వ్యక్తిగతంగా నాగ్ సినిమాలకు పెద్ద అభిమానినని చెప్పారు. ముఖ్యంగా నాగార్జున నటించిన ‘రక్షకుడు’ (రచ్చగన్) తనకు ఆల్‌టైమ్ ఫేవరెట్ మూవీ అని ధనుష్ వెల్లడించారు. ‘కుబేర’ షూటింగ్ సమయంలో నాగార్జునతో స్క్రీన్ షేర్ చేసుకోవడం తనకు మరపురాని అనుభవమని, అలాంటి స్టార్‌తో కలిసి నటించే అవకాశం రావడం తన అదృష్టంగా భావిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. ధనుష్ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ‘కుబేర’ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
